Sunday, April 28, 2024

టీమిండియాకు ఊరట.. రోహిత్ సహా ఐదుగురు క్రికెటర్లకు నెగెటివ్

- Advertisement -
- Advertisement -

Team India players test negative for covid 19

ల్‌బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఇటీవల బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించారన్న వార్త పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మతో పాటుగా ఐదుగురు క్రికెటర్లు రెస్టారెంట్‌కు వెళ్లడంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సభ్యులందరికీ ఆదివారం కరోనా టెస్టులు నిర్వహించారు. ఆర్‌టిపిసిఆర్ ఫలితాలు వచ్చిట్లు.. అందులో ఆటగాళ్లు ్ల అందరికీ నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు బిసిసిఐ సోమవారం వెల్లడించింది. జట్టు సహాయ సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించామని, వారందరికీ కూడా నెగెటివ్ వచ్చినట్లు తెలిపింది. ఈ నెల 7నుంచి భారత్‌ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన టీమిండియాకు ఎంతో ఊరటనిచ్చింది. తొలి రెండు టెస్టులు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగడంతో సిరీస్ సజావుగా సాగుతోందనుకుంటున్న తరుణంలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నవ్‌దీప్ సౌనీ, పృథ్వీషాలు బయట రెస్టారెంట్‌లో భోజనం చేశారన్న కారణంగా వారిని ఐసొలేషన్‌లో పెట్టడంపై వివాదం చెలరేగడం తెలిసిందే.
బిసిసిఐ నుంచి అలాంటి ప్రతిపాదనేదీ రాలేదు: సిఎ
ఇదిలా ఉండగా,కఠిన క్వారంటైన్ ఆంక్షల కారణంగా బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడేది లేదని టీమిండియా తేల్చి చెప్పినట్లు వచ్చిన వార్తలపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ స్పందించాడు. బిసిసిఐ నుంచి అటువంటి ప్రతిపాదన ఏదీ రాలేదని స్పష్టం చేశాడు. క్వీన్స్‌ల్యాండ్‌లో క్వారంటైన్ నిబంధనలకు బిసిసిఐ పూర్తి మద్దతుగా ఉందని, తాము ప్రతిరోజు బోర్డుతో మాట్లాడుతూనే ఉన్నామని ఆయన చెప్పాడు. సిడ్నీలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. బిసిసిఐ నుంచి అధికారికంగా అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని, ఇరుజట్లు షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపాడు. ఈ నెల 15నుంచి గబ్బాలో నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే బ్రిస్బేన్‌లో క్వారంటైన్ ఆంక్షలు కఠినంగా ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు భారత జట్టు ఆసక్తి చూపడం లేదని, ఫలితంగా నాలుగో టెస్టుపై సందిగ్ధత నెలకొందని ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వచ్చాయి. నాలుగో టెస్టును కూడా సిడ్నీలోనే జరపాలని భారత్ కోరుకుంటున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన నిక్ హాక్లీ వాటికి తెరదించే ప్రయత్నం చేశాడు.

Team India players test negative for covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News