Monday, April 29, 2024

కొత్తగా మరో 1015 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana corona cases district wise list

 

జిహెచ్‌ఎంసి పరిధిలో 172, జిల్లాల్లో 843 కేసులు నమోదు
వైరస్ దాడిలో ముగ్గురు మృతి
2,54,666కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
కొవిడ్ దాడిలో టాలీవుడ్ యువ రచయిత మరణం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 1015 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 172 తేలగా ఆదిలాబాద్‌లో 6, భద్రాద్రి 80, జగిత్యాల 18, జనగాం 12, భూపాలపల్లి 11, గద్వాల 10, కామారెడ్డి 13, కరీంనగర్ 46 ,ఖమ్మం 48, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 14, మహబూబాబాద్ 14, మంచిర్యాల 25, మెదక్ 12 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 97, ములుగు 12, నాగర్‌కర్నూల్ 21, నల్గొండ 57, నారాయణపేట్ 2, నిర్మల్ 15, నిజామాబాద్ 25, పెద్దపల్లి 17, సిరిసిల్లా 16, రంగారెడ్డి 98, సంగారెడ్డి 42, సిద్ధిపేట్ 15, సూర్యాపేట్ 21, వికారాబాద్ 14, వనపర్తి 9, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ లో 41, యాదాద్రిలో మరో 13 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,54,666కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,35,950కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

రెండు లక్షల 35 వేల మంది కోలుకున్నారు
రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు రెండు లక్షల 35 వేల, 950 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించడం వలనే ఇది సాధ్యమైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

92.65 శాతానికి పెరిగిన రికవరీ రేట్
రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో రికవరీ రేట్ 92.65 శాతానికి పెరిగినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది దేశ సగటు 92.8 శాతం కంటే ఎక్కువగా రికార్డు అయింది.

47 లక్షల 70 వేలకు పెరిగిన కరోనా టెస్టులు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 లక్షల 70 వేల మంది కి కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా 28వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

కోవిడ్ దాడితో టాలీవుడ్ యువ రచయిత మృతి
కరోనా వైరస్ బారిన పడి టాలివుడ్ యువ రచయిత వంశీ రాజేశ్ మృతి చెందారు. రెండు వారాల క్రిందట ఆయనకు పాజిటివ్ సోకగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకస్మికంగా ఆరోగ్యం విషమించి గురువారం తుదిశ్వాస విడిచినట్లు సన్నిహిత వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో స్టోరీ రైటర్‌గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కరోనా నాతో ఆడుకుంది

తప్పుడు కిట్లతో పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్‌లో వెల్లడించిన చిరంజీవి
సినీనటుడు చిరంజీవిని కరోనా కన్ఫూజ్ చేసింది. కాలం, కరోనా గత నాలుగు రోజులుగా తనను ఇబ్బంది పెడుతూ ఆడుకున్నట్లు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఆదివారం తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత బెసిక్ మెడిటేషన్ ప్రారంభించానని, రెండు రోజులైన లక్షణాలు తేలకపోయే సరికి అనుమానం వచ్చి ఆపోలో డాక్టర్లను సంప్రదించానని పేర్కొన్నారు. అక్కడ సిటీ స్కాన్ తీయగా చెస్ట్‌లో ఎలాంటి వైరస్ కణాలు లేవని వైద్యు లు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

దీంతో టెనెట్ ల్యాబ్‌లో 3 రకాల కిట్లులతో మరోసారి టెస్టు చేయించుకోగా అక్కడా నెగటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. చివరగా ఆదివారం పాజిటివ్ వచ్చిన చోట ఆర్‌టిపిసిఆర్ విధానంలో టెస్టు చేయించుకోగా అక్కడ కూడా నెగటివ్ వచ్చిందని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్టు తప్పుడు కిట్‌తో వచ్చిందని డాక్టర్లు నిర్ధారించినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇలాంటి సమయంలో ప్రజలు, అభిమానులు, ఆత్మీయులు చూపిన ప్రేమాభిమానాలకి, తన పేరిట పూజలు చేసిన వారందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News