Monday, April 29, 2024

తరుగు తీస్తే క్రిమినల్ కేసులు.. లైసెన్స్ రద్దు: ప్రశాంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

Vimula Prasanth Reddy
కామారెడ్డి: సిఎం కెసిఆర్ సూచనలు మేరకు మే 7 వరకు లాక్‌డౌన్ పాటించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో కరోనా కట్టడి, ధాన్యం కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. కామారెడ్డి జిల్లాలో కరోనా విస్తరించడంలేదన్నారు. ఇంకొన్ని రోజులు ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని కోరారు. వరి ధాన్యం కొనుగోలులో మిల్లర్లు నిబంధనలు పాటించాలని, అడ్డగోలుగా తరుగు తీస్తే క్రిమినల్ కేసులు పెట్టి లైసెన్స్‌లు రద్దు చేస్తామని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. చివరి గింజ వరకు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో కరోనా వైరస్ 970 మందికి వ్యాపించగా 25 మంది మృత్యువాత పడ్డారు. ఎపిలో కరోనా రోగుల సంఖ్య 955 చేరుకోగా 29 మంది చనిపోయారు. భారత్ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 23,240కు చేరుకోగా 727 మంది మరణించారు.

 

Telangana govt purchased every grain say Prashanth
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News