Thursday, May 9, 2024

టెస్కాబ్, మార్క్‌ఫెడ్ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

Telangana State Cooperative Apex Bank

 

5న టెస్కాబ్, 11న మార్క్‌ఫెడ్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక, 10న మార్క్‌ఫెడ్ ఏడు డైరెక్టర్ పదవులకు పోలింగ్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కా బ్), తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (మార్క్‌ఫెడ్) మేనేజింగ్ కమిటీకి ఎన్నికల కోసం సోమవారం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం టెస్కాబ్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నిక ఈ నెల ఐదో తేదీన, మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ కమిటీ డైరెక్టర్ల ఎన్నిక ఈ నెల 10వ తేదీన జరుగనుంది.

ఇక మార్క్‌ఫెడ్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నిక 11వ తేదీన జరగనుంది. టెస్కాబ్ ఎన్నికల నోటీసును మంగళవారం జారీ చేయనున్నారు. ఐదో తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు టెస్కాబ్ ఛై ర్మన్, వైస్ ఛైర్మెన్‌కు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 11.30 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఎవరైనా ఆ పదవులకు పోటీలో ఉంటే అదేరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఉపసంహరణలో ఒకరే మిగిలితే ఆయా పదవులను ఏకగ్రీవం అయినట్లుగా ప్రకటిస్తామని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వెల్లడించింది. ఇదిలావుంటే డిసిసిబి చైర్మెన్లంతా టెస్కాబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉంటారు. డిసిసిబి ఛైర్మన్లు టెస్కాబ్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్లను ఎన్నుకుంటారు. ఇక తెలంగాణ సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికకు ఈ నెల 4వ తేదీన ఎన్నికల నోటీసు ఇవ్వనున్నారు. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఒం టి గంట వరకు డైరెక్టర్ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తరువాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు సా.ఐదు గం. వరకు సమయం ఇచ్చారు.

ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గం టల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే ్ట ఫలితాలు వెల్లడించనున్నారు. ఇందులో ఏడుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. క్లాస్ ఎ మినహాయింపులో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు,జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల అధ్యక్షులు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్‌ను ఎన్నుకుంటారు.

Telangana State Cooperative Apex Bank Markfed elections
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News