Monday, April 29, 2024

మరో టెర్రరిస్టు అగ్రనేత హతం

- Advertisement -
- Advertisement -

Qasim al-Rimi

 

వాషింగ్టన్: అమెరికా సైన్యం మరో కీలక ఉగ్రవాద అగ్ర నేతను మట్టుబెట్టింది. అరేబియా ద్వీపకల్ప నుంచి అరాచకాలు సృష్టిస్తున్న అల్ ఖైదా నాయకుడు ఖాసీం అల్ రిమిని హతం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలియజేశారు. గతంలో అమెరికా స్థావరాలపై కాల్పులు జరిపింది తామేనని ఖాసీం ప్రకటించిన కొన్ని రోజులకే అతడు అమెరికా చేతిలో హతమయ్యాడు. యెమెన్ లో ఉగ్రవాదులకు, అమెరికా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఖాసీం చనిపోయాడని అమెరికా ధృవీకరించింది. 2018 డిసెంబర్ 6న ఫ్లోరిడాలోని వైమానిక స్థావరంపై ఆల్ ఖైదా ఉగ్రవాది కాల్పులకు తెగపడడంతో అమెరికా సైనకాధికారి దుర్మరణం చెందడంతో పాటు ఎనిమిది మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే సైన్యం జరిపిన కాల్పుల్లో సదరు ఉగ్రవాది హతమయ్యాడు. కానీ ఆ దాడికి పాల్పడింది తానేనని ఖాసీం అల్ రిమిని ప్రకటించారు. దీంతోనే ఖాసీమ్ ను అమెరికా అంతం చేసినట్టు సమాచారం.

Terrorist Leader Qasim al-Rimi killed by America,United States killed the leader of Al Qaeda’s affiliate in Yemen, the White House confirmed 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News