Monday, April 29, 2024

ఇప్ప పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: 45 ఏళ్ల గిరిజన వ్యక్తిపై పులి దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో జరిగింది. రామ్‌సుహవన్ అనే వ్యక్తి ఇప్ప పువ్వు సేకరించటానికి తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్లాడు. ఇప్ప పువ్వు సేకరిస్తుండగా పులి ఎదురుపడింది. రామ్‌సుహవన్‌పై పులి పంజా విసిరింది. రామ్‌సుహవన్ కుడి భుజాన్ని నోటిలో కరుచుకొని వెళ్తుండగా స్నేహితులు వెంబడించారు. స్నేహితులు గట్టిగా కేకలు వేస్తూ కర్రలతో కొట్టడంతో రామ్‌సుహవన్ అక్కడే వదిలి పులి పారిపోయింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని స్నేహితులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెడ, భుజం భాగంలో తీవ్రంగా గాయపడినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. భుజానికి, మెడకు మధ్య ఉన్న ఎముక విరిగిపోయిందని అటవీ అధికారి విన్సెంట్ రహీమ్ తెలిపాడు. గిరిజనులు ఎవరు ఇప్ప పువ్వు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని రహీమ్ తెలిపాడు. ఒక్క నెల వ్యవధిలో మధ్య ప్రదేశ్‌లో  ఐదు సార్లు పులులు దాడి చేశాయని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. బంధవ్‌గఢ్, పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులులు ముగ్గురు మహిళల  ప్రాణం తీశాయి. సాత్పూరా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో శిశువు పులి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

 

Tiger attack on man due mahua in bandhavgarh forest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News