Monday, April 29, 2024

టీ‘వీక్షణం’ మరింత ఖరీదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టివి చూసే ప్రేక్షకులకు కేంద్రం పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి 40 శాతం చార్జీలను పెంచాలని ఎంఎస్‌ఓలను ట్రాయ్ ఆదేశించింది. ఇది దేశవ్యాప్తంగా అమలు కానుండడంతో ఎంఎస్‌ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓటిటి ప్లాట్‌ఫాంతో పాటు జియో, టాటా స్కై, ఎయిర్‌టెల్ లాంటి డిష్‌ల రాకతో వినియోగదారు లు తగ్గిపోయారని ఈ నేపథ్యంలో ధరలను పెంచి తే ఉన్న వినియోగదారులు తగ్గిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 డిసెంబర్‌లో కేంద్రం డిజిటలైజేషన్ అమల్లోకి తీ సుకురాగానే దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్‌ఓలు కో ర్టుకు వెళ్లారు. ఇన్ని రోజులుగా కోర్టులో స్టే తో నె ట్టుకొచ్చిన ఎంఎస్‌ఓలకు సుప్రీంకోర్టులో స్టే వెకేట్ చేయడంతో 40శాతం చార్జీలను ఎంఎస్‌ఓలు పెం చాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులపై అదనపు భారం మోపకుండా చర్యలు చేపట్టాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నే పథ్యంలో తెలుగు రాష్ట్రాల ఎంఎస్‌ఓలు ఇందిరాపార్కు వద్ద నేడు ధర్నా నిర్వహించనున్నారు. ప్ర స్తుతం వినియోగదారులు తగ్గిపోతుండడంతో కే బుల్ ఆపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారని మ రోసారి ఇలా చార్జీలను పెంచితే ఉన్న వినియోగదారులు వేరే మార్గాన్ని ఎంచుకుంటారని ఎంఎస్‌ఓలు వాపోతున్నారు. ప్రస్తుతం ఓటిటిల రాకతో చాలామంది నెట్ కనెక్షన్‌కు మొగ్గు చూపుతున్నారని ఈ ఓటిటిలను ట్రాయ్ తమ పరిధిలోకి చేర్చకపోవడంతో వారికి ఎలాంటి చార్జీలు లేవని ఈ నేపథ్యంలోనే వినియోగదారులు వాటిపై ఆసక్తి చూపుతున్నారని వాటిని కూడా ట్రాయ్ పరిధిలో చేర్చాలని ఎంఎస్‌ఓలు డిమాండ్ చేస్తున్నారు. ఇరు తెలు గు రాష్ట్రాల్లో 3 వేల మంది ఎంఎస్‌ఓలతో పాటు 30 వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఈ వ్యవస్థను నడిపిస్తున్నారని ప్రస్తుతం ‘ట్రాయ్’ ఆదేశాల మేర కు వినియోగదారులపై అదనపు చార్జీలను వేస్తే చాలామంది వినియోగదారులు తమకు తగ్గిపోతారని, ఇది సబబు కాదనీ ఎంఎస్‌ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎంటర్‌టైన్‌మెంట్ చా నల్‌కు రూ.19, స్టోర్ట్‌కు రూ.19లు, ఇలా వినియోగదారుడు ప్రస్తుతం ఒక్కో చానల్‌కు ఒక్కో రేటును చెల్లించాల్సి వస్తోందని, ధరలు ఇప్పటికే అధికంగా ఉండడంతో పూర్తి స్థాయిలో అన్ని చానళ్లను వీక్షించలేక పోతున్నారని మరోసారి చార్జీలను పెంచితే ఇబ్బందులు తప్పవని ఎంఎస్‌ఓలు వాపోతున్నారు.

నవంబర్‌లో ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్‌కు సవరణ

గత సంవత్సరం నవంబర్‌లో ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్ 2.0ని సవరించింది, దీనిలో భాగంగా ఒక టివి ఛానెల్ నెలవారీ ధరను రూ.12ల నుంచి రూ.19లకు పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి 40 శాతం ధరలను పెంచాలని ఎంఎస్‌ఓలను ట్రాయ్ ఆదేశించింది. నిరంతరం సబ్ స్ర్కైబ్‌లను కోల్పోతున్న ఎంఎస్‌లకు ఇది పిడుగులాంటి వార్త అని పలువురు కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెలకు 2.5 శాతం చందాదారుల తగ్గుదల

గత సంవత్సరం ట్రాయ్ ఆదేశాలపై ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (ఏఐడిసిఎఫ్) కేబుల్ టెలివిజన్ పరిశ్రమ నెలకు 2.5 శాతం చందాదారుల కొరతను ఎదుర్కొంటుందని, కొత్త టారిఫ్ ఆర్డర్ అమలుతో ఇది మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ ఆదేశాలను పునః పరిశీలించాలని ఏఐడిసిఎఫ్ ట్రాయ్‌కు విజ్ఞప్తి చేసింది. ట్రాయ్ ఆదేశాలు అమలయితే దాదాపు 150,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని ఏఐడిసిఎఫ్ పేర్కొంది.

180 రోజులు లేదా ప్రత్యామ్నాయం కనిపించేంత వరకు….

జనవరి 25వ తేదీన ట్రాయ్‌కు ఏఐడిసిఎఫ్ లేఖ రాసింది. వినియోగదారుల కోసం ఛానెల్ల ధరలను పెంచబోమని అందులో పేర్కొంది. దీనిపై ట్రాయ్ స్పందించకపోవడం, కనీసం పంపిణీదారులకు అవసరమైన సమయాన్ని ఇవ్వడం లేదనీ ఏఐడిసిఎఫ్ ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి ప్రత్యామ్నాయం మార్గం కనుగొనబడే వరకు లేదా ప్రత్యామ్నాయంగా, అమలు కోసం 180- రోజుల అనుమతిని అదనంగా ఇచ్చేలా ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఏఐడిసిఎఫ్ పేర్కొంది.

వినియోగదారులకు మేలు జరిగేలా: ట్రాయ్

కానీ, ఎంఎస్‌ఓలు, ఏఐడిసిఎఫ్‌ల ఆవేదన ఇలా ఉంటే ట్రాయ్ మాత్రం మరోలా దీని గురించి పేర్కొంటుంది. ప్రతి వినియోగదారుడు ఇప్పుడు 100 ఛానెళ్లకు బదులుగా 228 టివి ఛానెళ్లను గరిష్టంగా రూ. 130లోనే పొందవచ్చని, నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజుపై వినియోగదారులు రూ. 40- నుంచి రూ.50ల వరకు ఆదా చేసుకోవచ్చని ట్రాయ్ పేర్కొనడం గమనార్హం.

3 వేల మందితో ఇందిరాపార్కు వద్ద

ఈ నేపథ్యంలోనే నేడు (సోమవారం) ఇరు తెలుగు రాష్ట్రాల ఎంఎస్‌ఓలు ఇందిరాపార్కు వద్ద సుమారు 3 వేల మందితో ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు (ట్రాయ్) ఆదేశాలు ఎంఎస్‌ఓల పొట్టకొట్టే విధంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News