Monday, April 29, 2024

జిల్లాల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి కొత్త రెవెన్యూ చట్టంపై శిక్షణ

- Advertisement -
- Advertisement -

Training on new Revenue Act for field staff working in districts

 

10వ తేదీ నుంచి 17 వరకు అవగాహన తరగతులు

మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంపై జిల్లాల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి (ఎఫ్‌టిఎస్) హైదరాబాద్‌లో శిక్షణ ప్రారంభమయ్యింది. జిల్లా స్థాయిలో ఉండే ఎఫ్‌టిఎస్‌ను ఒక్కొక్కరిని పంపించాలని జిల్లా కలెక్టర్‌లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ రెండురోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 17వ తేదీ వరకు వీరికి హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ధరణి ఫోర్టల్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలపై అవగాహన కల్పించడంలో భాగంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి తహసీల్దార్‌లకు జరగాల్సిన శిక్షణను ప్రభుత్వం వాయిదా వేసింది. మూడురోజుల పాటు వీరికి శిక్షణా తరగతులను సర్వే ట్రైనింగ్ అకాడమీలో నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కౌంటింగ్ నేపథ్యంలో ప్రస్తుతానికి తహసీల్దార్‌ల మూడురోజుల శిక్షణా కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా నుంచి ఎఫ్‌టిఎస్ సిబ్బందికి శనివారం శిక్షణా తరగతులను ప్రభుత్వం ప్రారంభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News