Monday, April 29, 2024

కరోనా నియంత్రణలో ట్రంప్ వైఖరి గందర గోళం

- Advertisement -
- Advertisement -

Trump

 

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ధ్వజం

వాషింగ్టన్ : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కచ్చితమైన గందరగోళంగా తయారైందని, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా తప్పు పట్టారు. ఒబామా తన హయాంలో పని చేసిన దాదాపు 3000 మంది అధికారులతో కూడిన ఒబామా అల్యుమినీ అసోసియేషన్ సభ్యులతో శుక్రవారం మాట్లాడిన సందర్భంగా ట్రంప్ విధానాలపై ధ్వజమెత్తారు. ట్రంప్ మొదటి జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్‌పై క్రిమినల్ కేసును ఎత్తివేయడంపై న్యాయవిభాగంపై కూడా ఒబామా తీవ్రంగా స్పందించారు. నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బిడెన్‌కు మద్దతు పలకాలని ఒబామా వారిని కోరారు.

ఈ సుదీర్ఘ కాల పరిణామాల్లో మనం దేనికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నామో అందులో స్వార్థం, ఆటవికత, విభజించడం, ఇతరులను శత్రువులుగా చూడడం వంటి లక్షణాలు అమెరికా ప్రజల జీవితాల్లో ప్రస్తుతం భాగమయ్యాయని, అంతర్జాతీయంగా ఇదే తీరు కొనసాగుతోందని, ఈ కారణం గానే కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు పేలవంగా స్పందిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నాకేంటి అన్నధోరణి పెరిగి అందరితో కయ్యాలు పెటుకోడం ప్రస్తుత ప్రభుత్వంలో పరిపాటి అయిందని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News