Monday, April 29, 2024

పట్టపగలే యువతి కిడ్నాప్‌కు యత్నం

- Advertisement -
- Advertisement -

kidnap

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తన తండ్రితో కలిసి వస్తున్న ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఘటన శుక్రవారం నాడు హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు కథనం మేరకు వివరాలిలావున్నాయి యువతి కుటుంబానికి పరిచయం ఉన్న సల్మాన్ మీర్జా బేగ్, అతని నలుగురు స్నేహితులు, పథకం ప్రకారం, యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. తండ్రి మహమ్మద్ షరీఫ్ తో కలిసి ఆమె, కూరగాయలు కొనుక్కునే నిమిత్తం వస్తుంటే, తొలుత తండ్రి కళ్లలో కారం కొట్టారు.

ఆపై ఆమెను ఎత్తుకెళ్లేందుకు తీసుకుని వచ్చిన కారులోకి నెట్టేందుకు ప్రయత్నించారు. ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ ఉండటం, చుట్టు పక్కల వారు సమీపంలోకి రావడంతో, వారిని వదిలేసి పరారయ్యారు దుండగులు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయని, వాటి ద్వారా విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Trying to kidnap Young Woman
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News