Monday, April 29, 2024

హౌతీ రెబెల్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : యెమెన్‌లో ఇరాన్ అండ ఉన్న హౌతీ రెబెల్ సైనిక స్థావరాలపై అమెరికన్ దళాలు ఐదవ సారి దాడులు సాగించాయి. అయితే, ఎర్ర సముద్రంలో ప్రపంచ నౌకాయానానికి అంతరాయం కలిగించిన నౌకలపై తీవ్రవాదుల దాడులను అమెరికన్, బ్రిటిష్ దాడుల పరంపర ఇప్పటికీ నిరోధించలేకపోయినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. తాజా దాడులలో ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలోకి లక్షంగా

వదిలిన రెండు హౌతీ నౌకా విధ్వంసక క్షిపణులను ధ్వంసం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. నేవీ ఫైటర్ విమానాలు ఆ దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ పెంటాగన్ తెలియజేసింది. అమెరికా తన దాడులను కొనసాగిస్తుందని బైడెన్ తెలిపారు. అయితే, వాణిజ్య, సైనిక నౌకలను వేధించకుండా హౌతీలను తాము ఇంత వరకు నిరోధించలేకపోయినట్లు బైడెన్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News