Sunday, April 28, 2024

సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ : ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని రోడ్డు, భవనాల డిపార్ట్‌మెంట్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గానికి పరిపాలన సౌలభ్యం కోసం ఆనాడు రెవెన్యూ డివిజన్ కోసం ముఖ్యమంత్రిని కోరగా తక్షణమే మంజూరు చేశారన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో వందల కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బి రోడ్లు ఉన్నాయని, ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం కోసం ఒక కార్యాలయం ఉండాలని, సంబంధిత అధికారులు ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డిని కోరిన వెంటనే ఆర్‌అండ్‌బి సబ్ డివిజన్ కార్యాలయాన్ని మంజూరు చేశారని ఎమ్మెల్యే అన్నారు. పానుగల్ మండల కేంద్రంలో ఈడి అగ్రికల్చర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని, కొల్లాపూర్ మండలంలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేసుకున్నామన్నారు.

సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు. పరిపాలన సంస్కరణలతో తెలంగాణను ప్రగతిపథంలో సిఎం కెసిఆర్ నిలిపారన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు, నూతన మున్సిపల్, పంచాయతి రాజ్ చట్టాలతో ప్రభుత్వ పరిపాలన ప్రజలకు మరింత చేరువ అయిందన్నారు. నూతన సెక్రటరియేట్, కలెక్టర్లు, జిల్లా ఎస్పి కార్యాలయాల నిర్మాణంతో పరిపాలన సౌలభ్యం, ప్రజా ప్రయోజనాలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆర్‌అండ్‌బి అధికారులు, బిఆర్‌ఎస్ నాయకుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News