Monday, April 29, 2024

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీని నడిపించాల్సిన వాడిని నీవే వెనకబడుతున్నావని సూచనలతో పాటుగా హెచ్చరికలు చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ చూపుతున్నట్లు తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ పైన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా.. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెట్ తో పాటుగా సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లోనూ వెనుకబడి ఉన్నారని రాహుల్ తేల్చి చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం చేసుకోవాలని.. సీనియర్లకు ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసారు. ఉత్తమ్ చేసిన ఫిర్యాదుపైన వివరణ కోరారు.

మరోవైపు, రాహుల్ గాంధీ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించారు. ఎన్నికల్లో గెలిచేందుకు కార్యాచరణతో సిద్ధమయ్యారు. కర్ణాటక గెలుపును తెలంగాణలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పని చేయటం ద్వారా అధికారంలోకి వచ్చిన అంశాన్ని రాహుల్ గెలుపు వ్యూహంలో ప్రధాన అంశంగా గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ కు అదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరూ వ్యక్తిగత  అభిప్రాయాలు.. ఈగోలతో వ్యవహరిచినా ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణలో గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేసారని పార్టీలో చర్చ జరుగుతోంది. రేవంత్ పైన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాంధీకి ఫిర్యాదు చేసారు. తన పైన రేవంత్ టీం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలు సమర్పించారు. తనను పార్టీలో నుంచి బయటకు పంపే విధంగా పొమ్మనకుండా పొగ పెడుతున్నారని నేరుగా సోనియాకు వివరించారు. ఈ అంశం పైన రాహుల్ నేరుగా రేవంత్ ను నిలదీసినట్లు సమాచారం. ఇదే సమయంలో రేవంత్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆదరణ తగ్గటం పైనా రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై రాహుల్ గాంధీ వద్ద ఆసక్తికర చర్చ జరిగింది తెలుస్తోంది.

Also Read: ఈటల రాజేందర్ హత్యకు కుట్రః ఈటల జమున సంచలన ఆరోపణలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News