Monday, April 29, 2024

కవితకు థ్యాంక్స్ చెప్పిన విజయ్ దేవరకొండ

- Advertisement -
- Advertisement -

Vijay devarakonda said thanks for MLC kavitha

హైదరాబాద్: ప్రకృతిని పూజించే పండుగ.. పూల పండుగ విశిష్టతను, తెలంగాణ ఖ్యాతిని దేశ నలుమూలలా తెలియజెప్పేలా బతుకమ్మ గీతాన్ని తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించడం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు విజయదేవరకొండ అన్నారు. అల్లిపూల వెన్నెల పాటను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… డైరెక్టర్ గౌతమ్‌మీనన్‌తో కలిసి విడుదల చేసిన విషయం విధితమే. ట్వీట్‌లో బతుకమ్మ శుభాకాంక్షలను తెలిపిన విజయ్‌దేవరకొండ.. అనంతరం కల్వకుంట్ల కవిత అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ఉద్వేగభరితంగా ఈ సాంస్కృతిక వేడుకను ప్రోత్సాహిస్తున్నారు. ఈ అందమైన పండుగ గురించి మాకు, దేశవ్యాప్తంగా అవగాహన కల్పించారు అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News