Monday, April 29, 2024

‘విరాట పర్వం’ టీజర్ ను లాంచ్ చేసిన మెగాస్టార్..

- Advertisement -
- Advertisement -

Virata Parvam Teaser launched by Chiranjeevi

రానా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం’. ఈ చిత్రంలో రానా నక్సలైట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియమణి ‘భారతక్క’గా నటిస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశాడు. భూస్వాముల ఆకృత్యాలపై రానా కవిత్వం, సాయిపల్లవి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రానా కవిత్వాలకు ఫిదా అయిన సాయిపల్లవి ప్రేమలో పడుతుంది. తన ప్రేమకోసం అన్ని వదిలేసి రానా వద్దకు వెళ్లే క్రమంలో సాయిపల్లవి పలు సమస్యలు ఎదురవుతాయి. ఇలా ఆద్యంతం ఆసక్తిగా కొనసాగిన టీజర్, సినిమాపై అంచనాలు పెంచేసింది. బొబ్బిలి సురేష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు సమర్పిస్తుండగా, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీని వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Virata Parvam Teaser launched by Chiranjeevi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News