Monday, April 29, 2024

విధుల్లో చేరిన విఆర్‌ఓలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎట్టకేలకు విధుల్లో చేరిన విఆర్‌ఓలు
98 శాతం మంది వారికి కేటాయించిన శాఖల్లో జాయినింగ్
విఆర్‌ఓలు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనుకుంటే
వారికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం!
త్వరలో విధి, విధానాలు ఖరారయ్యే అవకాశం
మనతెలంగాణ/ హైదరాబాద్: ఎట్టకేలకు 98 శాతం విఆర్‌ఓలు విధుల్లో చేరారు. వివిధ శాఖల్లో కేటాయింపు ప్రక్రియ గురువారం నాటికి విజయవంతంగా ముగిసింది. మొత్తం 98 శాతం మంది విఆర్‌ఓలు తమకు కేటాయించిన శాఖల్లో జాయిన్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 5, 137 విఆర్‌ఓలు ఉండగా వారిని వివిధ ప్రభత్వ శాఖలకు కేటాయించగా గురువారం వరకు 5,014 మంది విధుల్లో చేరారు. ప్రభుత్వ ఉత్తర్వులు 121ను సవాలు చేస్తూ 19 మంది కోర్టుకు వెళ్లినప్పటికీ కేవలం ఈ 19 మందికి మాత్రం కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ 19 మందిలోనూ దాదాపు 15 మంది విఆర్‌ఓలు తమకు కేటాయించిన శాఖల్లో జాయిన్ అయినట్టుగా సమాచారం. ఈ అంశంపై గురువారం ప్రభుత్వ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం జరపడంతో పాటు రెవెన్యూశాఖలో విఆర్‌ఓలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించేది లేదని, తప్పని సరిగా వారికి కేటాయించిన శాఖల్లో జాయిన్ కావాల్సిందేనని స్పష్టం చేసినట్టుగా తెలిసింది. అయితే, ఎవరైనా విఆర్‌ఓలు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనుకుంటే, నిబంధనల మేరకు వారికి అనుమతి నివ్వాలని కూడా నిర్ణయించినట్టుగా సమాచారం. దానికి సంబంధించిన విధి, విధానాలు త్వరలో ఖరారు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.

VROs Join New Posting in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News