Monday, April 29, 2024

విడతల వారీగా వేతన బకాయిలు

- Advertisement -
- Advertisement -

Wage arrears in installments

 

ఉద్యోగులకు నాలుగు దఫాల్లో..
పెన్షనర్లకు రెండు దఫాలుగా చెల్లింపు
డిసెంబర్‌లో బకాయిల చెల్లింపులు పూర్తి
ఉత్తర్వులు జారీ చేసిన
రాష్ట్ర ప్రభుత్వం, సిఎంకు
ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా కోత విధించిన వేతనాల బకాయిల చెల్లింపుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం పెన్షనర్‌లకు రెండు విడతల్లో కోత విధించిన మొత్తం బకాయిలను చెల్లించనున్నారు. అక్టోబర్ నెలలో కొంత మొత్తం, నవంబర్ నెలలో కొంత చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.

అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించిన మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌తోపాటు వచ్చే ఏడాది జనవరి నెలల్లో బకాయిలను చెల్లించనున్నారు. కోత విధించిన మొత్తం రూ.6 వేల కోట్ల లోపు ఉంటుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణకు తెలిపారు. వాస్తవానికి విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులతో పాటు ఉద్యోగుల జీతాల్లో, పెన్షన్‌లో మార్చి నెల నుంచి ప్రభుత్వం కోత విధించింది. అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, 4వ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో 25 శాతం కోత పెట్టారు. నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో 10 శాతం కోత విధించారు.

ఇక అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాలు, పింఛన్లలో కోత పెట్టారు. కోత పెట్టిన వేతనాలు, పింఛన్ల మొత్తాన్ని వాయిదాల్లో తదుపరి చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ కోతల నుంచి వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వరుసగా 3 నెలలు (మార్చి, ఏప్రిల్, మే) వేతనాలు, పింఛన్లలో కోత విధించింది. దీనిపై ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. అయితే లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడం, ఆదాయం క్రమంగా గాడిలో పడుతుంటంతో జూన్ నెల నుంచి పూర్తి వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. తెలంగాణలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులున్నారు. ఇందులో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది, 2.5 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News