Monday, April 29, 2024

కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదు…..

- Advertisement -
- Advertisement -

 

సిటీబ్యూరో : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైరస్ ఇంకా ముగిసిపోలేదని, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, ఇప్పటివరకు కేవలం 28 శాతం మంది మాత్రమే అర్హులైన బూస్టర్ డోసు వేసుకున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ వేసుకోవాలని సూచించారు. వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఇంకా ఎలాంటి మార్పులు లేవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కొత్త వేరియంట్‌లను ఎప్పటికప్పుడు గుర్తించడానికి పాజిటివ్ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించింది. అందుకోసం కొవిడ్ పాటిజివ్‌గా తేలిన నమూనాలను ప్రతి రోజు సార్స్ కోవ్ 2 జినోమిక్స్ కన్సార్టియం పరీక్షా కేంద్రంకు పంపించాలన్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు అదుపులో ఉన్నాయి. రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి 15 లోపు కేసులు నమోదుగా అందులో సగం కేసులు గ్రేటర్ నగరంలోనే నమోదైతున్నాయి. వైద్యశాఖ ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, వస్త్రదుకాణాలు, పండ్లు, కూరగాయల మార్కెట్లు, హోటళ్లు, ఆర్టీసీ బస్సుల్లో మాస్కులు ధరించాలనే బోర్డులు తప్పకుండా పెట్టాలని యాజమానులకు ఆదేశాలివ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అదే విధంగా ఆటోలు, క్యాబ్‌లు, ద్విచక్రవాహానాల్లో తిరిగే మాస్కులు ధరించేలా చూడాలని చెప్పింది. వీటితో పాటు ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, ఈఎన్‌టి ఆసుపత్రులతో బస్తీదవఖానలు, పిహెచ్‌సీల్లో కరోనా కిట్టులు, మందులు, తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో రెండు దశల్లో విజృంభణ చేసిన కరోనాను వైద్యశాఖ సిబ్బంది ఎదుర్కొని వైరస్ సోకిన రోగులకు సకాలంలో చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడారు. అదే అనుభవంతో మరోసారి మహమ్మారి ఉనికి చాటే ప్రయత్నం చేస్తే ప్రాథమిక దశలోనే నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నగర ప్రజలు కూడా నిర్లక్షంగా వ్యవహరించకుండా బయటకు వెళ్లితే ముఖానికి మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటిస్తే ఆరోగ్యపరమైన సమస్యలు దరి చేరవని, ఇష్టానుసారంగా తిరిగితే వైరస్‌ను ఆసుపత్రుల బాట పట్టిస్తుందంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News