Monday, April 29, 2024

మీరట్‌లో ఢిల్లీ నిర్భయ ఘట్టం

- Advertisement -
- Advertisement -

Woman raped by Bus driver and conductor in meerut

 

వీధుల్లోకి విసిరేసిన దారుణం
కండక్టర్ డ్రైవర్ల వికృత విధినిర్వహణ

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణరీతిలో ఢిల్లీ నిర్భయ ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మీరట్‌లో పరుగులు తీస్తున్న బస్సులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నెల రోజుల వ్యవధిలో యుపిలో ఇటువంటి దారుణాలు జరగడం ఇది మూడోసారి. మీరట్‌లోని వీధులలో చాలా పొద్దుపోయిన తరువాత రాత్రంతా చక్కర్లు కొట్టిన బస్సులోనే మహిళపై దుండగులు సామూహిక మానభంగానికి దిగారు. ఈ దారుణానికి దిగింది ఆమెను బస్సులోకి ఎక్కించుకున్న డ్రైవర్, కండక్టరే అని వెల్లడైంది. రాత్రి అంతా లైంగికంగా హింసించి తరువాత ఆమెను కదులుతున్న వాహనంలో నుంచి బయటకు విసిరేశారు. 2012 చలిరాత్రి ఢిల్లీలో ఓ పారామెడికల్ విద్యార్థినిపై జరిగిన దారుణ అకృత్యాన్ని ఈ 2020 సెప్టెంబర్ ఘటన ఆసాంతం అచ్చుతీర్చినట్లుగా తలపించింది. అప్పట్లో ఢీల్లీలో ఐదుగురు దుండగులు విద్యార్థినిపై సామూహిక అత్యాచారాపు పైశాచిక ఆనందాన్ని అనుభవించారు.

ఇప్పుడు మీరట్‌లో ఈ ఉదంతంలో ఈ మహిళపై చీకటి బస్సులో ఎందరు రాక్షసత్వానికి పాల్పడ్డారనేది వెలుగులోకి రాలేదు. అప్పట్లో ఢిల్లీలో దారుణానికి గురై తీవ్రగాయాల పాలయిన యువతి ఆ తరువాత చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇప్పుడు శుక్రవారం రాత్రి అంతా నరకం చవిచూసి చివరికి బస్సులో నుంచి సరుకుగా బయటకు తోసేయబడిన రీతిలో మీరట్‌లోని ఢిల్లీ రోడ్‌పై స్పృహలేని స్థితిలో ఒంటిపై గాయాలతో కన్పించిన మహిళను శనివారం పోలీసులు ఎవరో ఇచ్చిన మేరకు కనుగొన్నారు. ఇక్కడ జరిగిన అత్యాచార ఘటన గురించి మీరట్ పోలీసు అధికారి అజయ్ సాహ్నీ ధృవీకరించారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు ఆదివారం తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటన గురించి పోలీసులకు శనివారం తెలిస్తే , దీనిపై ఉన్నతాధికారులు ఆదివారం స్పందించగలిగారు.

నగరంలోని పలు రాదార్లలోని సిసిటివీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు , ఈ బస్సు ఎక్కడెక్కడ తిరిగిందో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిసిటీవీ ఫుటేజ్‌లతో దొరికే సమాచారం ఈ కేసుకు సంబంధించి కీలక సాక్షాధారం అవుతుందని భావిస్తున్నారు. బాధితురాలు కోలుకున్న తరువాత ఈ మహిళ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తాను శుక్రవారం రాత్రి భైసాలి బస్టాండ్ వద్ద బస్ ఎక్కినట్లు, తరువాత కొద్ది సేపటికి తనకు కూల్‌డ్రింక్ ఇచ్చారని, దీనిని తీసుకున్న తరువాత తనకు మత్తు కమ్ముకుందని, దీనితో తాను స్పృహతప్పిపోయినట్లు , తనపై డ్రైవర్, కండక్టర్ రాత్రంతా అత్యాచారానికి దిగినట్లు ఈ మహిళ పోలీసులకు తెలిపారు. ఇటువంటి ఘటనలలో ఇది మూడో ఘటనగా నమోదైంది. గత నెలలో ఓ ప్రయాణికురాలు మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్లుతుండగా బస్సులోనే బస్సు సిబ్బందే అత్యాచారం జరిపింది. ఈ బాధితురాలు మీరట్ జిల్లాకు చెందిన సర్ధానా టౌన్‌కు చెందిన వ్యక్తిగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News