Monday, April 29, 2024

కవిత విజయం ఖాయం

- Advertisement -
- Advertisement -

Kavitha victory confirm in MLC election

ఎన్నిక లాంఛనమే
ఫలితాలు అక్టోబర్ 12న
పదవీకాలం 14 నెలలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలు లాంఛనంగానే నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం ఖారారు అయినప్పటికీ ఎన్నికల నిబంధనల మేరకు మాత్రమే ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొదటి నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ మెజారిటీలేని రాజకీయపార్టీలు నామినేషన్ వేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. నిజమాబాద్ జిల్లా మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత విజయానికి మించి మెజారిటీ ఈ జిల్లాలో ఉంది. స్థానిక సంస్థల ప్రతినిధులే ఓటర్లుగా ఉండటంతో జిల్లాలో అత్యధిక శాతం స్థానిక సంస్థల అభ్యర్థులు టిఆర్‌ఎస్ పార్టీ నుంచే ఎన్నికయ్యారు. అంతేకాక రాష్ట్ర స్థాయి నాయకురాలు, సిఎం కెసిఆర్ కూతురు స్వయంగా ఇక్కడ పోటీలో ఉండటంతో స్థానిక సంస్థల ప్రతినిధులకు కవితతో కలిసి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే అరుదైన అవకాశం లభించింది.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి, ఇండిపెండెంట్ స్థానిక సంస్థల ప్రతినిధులు అత్యధికంగా టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా టిఆర్‌ఎస్‌కు ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో 90 శాతం స్థానిక సంస్థల అభ్యర్థులు కవిత పక్షాన నిలబడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, స్థానిక శాసనసభ్యులు మొత్తం కలిసి 824 మంది ఉన్నారు. ఇందులో నోటిఫికేషన్ వెలుబడక ముందు టిఆర్‌ఎస్ నుంచి గెలిచిన వారు 570, కాంగ్రెస్ నుంచి 152, బిజెపినుంచి 78 మంది ఉన్నారు. అలాగే ఇండిపెండెంట్లు 24 మంది ఉన్నారు. నోటిఫికేషన్ వెలుబడిన అనంతరం కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారని తెలిసి కాంగ్రెస్, బిజెపి, ఇండిపెండెంట్లు భారీగా టిఆర్‌ఎస్ పార్టీలో బహిరంగంగా చేరి కవితను బలపరుస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ బలం 700 వరకు చేరుకుందని టిఆర్‌ఎస్ నాయకత్వం అంచనావేస్తోంది. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇక్కడి రాజకీయ పరిణామాలు అధిష్టానానికి వివరిస్తూ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అయితే ఈ జిల్లాకు గతంలో కాంగ్రెస్ నుంచి పెద్దదిక్కుగా ఉన్న సురేష్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకుడు మండవ వెంకటేశ్వర్ రావు ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో ఉండటంతో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ మరింత బలహీనపడింది. బిజెపి అభ్యర్థి పోతనకర్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డి ఓటమి ఖరారైనా పోటీలోనే ఉన్నారు. అక్టోబర్ 9న ఎన్నికలు జరిగి 12న ఫలితాలు రానున్నాయి. కవిత విజయంతోనే బతుకమ్మ సంబురాలు మరోసారి అత్యంతవైభవంగా జరగనున్నాయని టిఆర్‌ఎస్‌నాయకులు చెప్పారు. అక్టోబర్ 12న కవిత విజయం, అక్టోబర్16న బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుండటంతో ఈ సారి తెలంగాణ బతుకమ్మ మరోసారి విశ్వవ్యాప్తి కానుంది. స్థానిక సంస్థల నుంచి ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థి కాలపరిమితి 4 జనవరి 2022లో ముగియనుంది. అయితే 14 నెలలపాటు కవిత శాసనమండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. కవిత శాసన మండలిలోకి రానున్నారనే విషయం తెలుసుకున్న మండలిసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిఎం కెసిఆర్ కూతురు శాసనమండలిలో ఉంటే సభ గొప్పతనం మరింత ఇనుమడిస్తుందని చెపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News