Monday, April 29, 2024

నేడు మహిళల ఫైనల్ సమరం

- Advertisement -
- Advertisement -

Women's T20 Challege: SUP vs TRA Final Match Tomorrow

షార్జా: మహిళల టి20 చాలెంజ్ 2020 టోర్నీ‌లో భాగంగా సోమవారం జరిగే ఫైనల్లో సూపర్ నొవాస్, ట్రయల్ బ్లేజర్స్ జట్లు తలపడనున్నాయి. మూడు జట్ల టోర్నమెంట్‌లో ఇరు జట్లు ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కిందటి మ్యాచ్‌లో సూపర్ నొవాస్ రెండు పరుగుల తేడాతో బ్లేజర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఓడినా నొవాస్ కూడా తుది పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్లో నొవాస్ ఓడించి ట్రోఫీని సాధించాలనే స్మృతి మంధాన జట్టు బ్లేజర్స్ తహతహలాడుతోంది. మరోవైపు హర్మన్‌ప్రీత్ సారధ్యంలోని నొవాస్ కూడా మరో విజయంపై కన్నేసింది.

Women's T20 Challege: SUP vs TRA Final Match Tomorrow

ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. ప్రియా పూనియా, ఆటపట్టు, హర్మన్‌ప్రీత్, రోడ్రిగ్స్ తదితరులతో సూపర్ నొవాస్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక మంధాన, డాటిన్, దీప్తి శర్మ, రిచా, ఎకిల్‌స్టోన్ తదితరులతో బ్లేజర్స్ బ్యాటింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరూ ట్రోఫీని గెలుచుకుంటారో ముందే చెప్పడం కష్టమే.

Women’s T20 Challege: SUP vs TRA Final Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News