Monday, April 29, 2024

సిక్స్ కొట్టాలనే దిగుతా: విజయ్ దేవరకొండ

- Advertisement -
- Advertisement -

World famous Lover

 

విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ “విజయ్ దేవరకొండతో మేము రెండు సినిమాలు చేశాము. మూడో సినిమాకి సిద్ధంగా ఉన్నాం. ఇంతదాకా విజయ్ జర్నీ ఎలా సాగిందో చూస్తూ వచ్చాను. చాలామంది దగ్గర తెలివితేటలు, టాలెంట్ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన టాలెంట్, మంచితనం, తెలివితేటలు కలిసి ఉన్న అరుదైన మనిషి విజయ్. భవిష్యత్తులో అతను ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా. ఈ సినిమా ట్రైలర్ చూస్తే డైరెక్టర్‌లో చాలా విషయం ఉందనే ఫీలింగ్ కలిగింది. సినిమా కూడా అంత బాగుంటుందని ఆశిస్తున్నా”అని చెప్పారు.

చిత్ర సమర్పకులు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ “ఈ సినిమా నేను మొదలుపెట్టానికి ప్రేరణ ఇచ్చింది క్రాంతిమాధవ్ చెప్పిన కథ. విజయ్ కూడా కథ విన్నాక ఇది చాలా గొప్ప సినిమా అవుతుందని చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ సినిమా 100 శాతం పర్‌ఫెక్ట్‌గా వచ్చిందా, లేదా అని చూసుకున్న వ్యక్తి విజయ్. ప్రతి సీన్ అసాధారణంగా ఉండేలా ఆయన నటించి… నలుగురు హీరోయిన్ల పాత్రలూ బాగా వచ్చేలా చూసుకొన్నారు. ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది”అని అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “నాలుగేళ్ల క్రితం 2016లో ‘పెళ్ళిచూపులు’ అనే సినిమాతో తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చా. ఇప్పటికి ఏడు సినిమాలు రిలీజయ్యాయి. ఇది నా తొమ్మిదో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈ నాలుగేళ్లలో కొన్ని హిట్లు కొట్టాను. ఈ సంవత్సరం నుంచి కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాను. ఇక ప్రతిసారి – నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ అనేది నాకు ఓపిక లేదు.

కొడితే స్టేడియం బయటకు కొట్టాలని బ్యాట్ ఊపుతా. కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ లైన్ దగ్గర క్యాచ్‌లు పడ్డాయి. కానీ భయమైతే లేదు. ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా. ఇది నా చివరి లవ్ స్టోరీ అని ఇంతకుముందే చెప్పాను. ఎందుకంటే నాకు అలాగే అనిపిస్తోంది. దర్శకుడు క్రాంతిమాధవ్ చెప్పిన స్క్రిప్ట్ వినగానే ఇది నా ఫైనల్ లవ్ స్టోరీ అని నిర్ణయించుకున్నా. ఇలాంటి క్యారెక్టర్ చేసే ఛాన్స్ నాకు మళ్లీ దొరకదు. ఎందుకంటే బొగ్గుగనిలో శీనయ్య లాగా నేను ఉండను, అలా మాట్లాడలేను. అలాగే ఒక ఫారిన్ పైలెట్‌తో ప్రేమలో ఉండను. గౌతమ్ రోల్‌ను నా జీవితంలో కొంత చూశాను. కానీ ఈ మూడు రోల్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.

ఈ నెల 14న ఈ సినిమాకొచ్చి ప్రేక్షకులందరూ ప్రేమలో పడతారనుకుంటున్నా”అని తెలిపారు. దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ “విజయ్ దేవరకొండ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాశాను. ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, కె.ఎ. వల్లభ, డి. సురేష్ బాబు, అభిషేక్ నామా, సి. అశ్వినీదత్, ఇజాబెల్లా, క్యాథరిన్, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఆనంద్ దేవరకొండ, ప్రియదర్శి, తరుణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

World famous Lover pre release event
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News