Monday, April 29, 2024

విద్యుత్ షాక్ తో 15 గేదెలు మృతి

- Advertisement -
- Advertisement -

buffaloes

మన తెలంగాణ/జగిత్యాల‌ః గాలివానకు తెగిపడ్డ విద్యుత్ తీగ.. 15 మూగజీవుల పాలిట మృత్యుపాశమైంది. ఈ విషాద సంఘటన జిల్లాలోని రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో మంగళవారం జరిగింది. అధికారులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పశువులకాపరి పశువుల మందను ఉదయం మేత కోసం భూపతిపూర్ గ్రామశివారులోకి తీసుకెళ్లాడు. ముందు వెళ్లిన పశువులు గడ్డి మేస్తూ వెళ్లగా.. అందులో 15 గేదెలకు విద్యుత్ తీగ తగిలి మృతి చెందాయి. ఒక్కొక్క గేదె విలువ దాదాపు రూ.40వేల నుండి రూ.50వేల వరకు ఉండటంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరౌతున్నారు. దాదాపు రూ.7లక్షల దాక నష్టం వాటిల్లినట్లు అధికారులు ఆంచనాకు వచ్చారు.

ఈనెల25న సాయంత్రం కురిసిన గాలివానకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. తెగిన విద్యుత్ వైర్లకు కరెంటు సరఫరా కావడంతో తీగను తాకిన గేదెలన్నీ సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన ఏనుగు వినోద్‌రావు రెండు గేదెలు, గోనె విష్ణు రెండు గేదెలు, ఆర్మూర్ నర్సయ్యకు చెందిన రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. అలాగే వేములవాడ విజయ, పల్లికొండ నర్సయ్య, పల్లికొండ భీమలింగం, గోనె గంగమల్లయ్య, నేతుల చిన్నమల్లయ్య, గొల్లపెల్లి రాజన్న, పల్లికొండ నర్సయ్య, ముద్దం లక్ష్మి, నేతుల సురేష్‌లకు చెందిన ఒక్కొక్క గేదె మృతి చెందినట్లు ట్రాన్స్‌కో ఎఇ శ్రీనివాస్ తెలిపారు. సంఘటన స్థలాన్ని ట్రాన్స్‌కో డిఇఇ హరికృష్ణ, ఎడిఇ జవహర్‌నాయక్, రాయికల్, ఒడ్డెలింగాపూర్ ఎఇలు అర్జున్, శ్రీనివాస్‌లు పరిశీలించారు. రైతులకు సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

15 buffaloes died due to electric shock in Jagtial district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News