Monday, April 29, 2024

క్యాన్సర్ రోగులకు రెండేళ్ల భారతీయ బాలుని కేశ దానం

- Advertisement -
- Advertisement -

2-year-old Indian boy becomes youngest Hair donor for Cancer Patients

 

దుబాయ్: క్యాన్సర్ రోగులకు కేశ దాన ప్రచారం కోసం ఏర్పడిన ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్(ఎఫ్‌ఓసిపి) అనే స్వచ్ఛంద సంస్థలో తన పేరు నమోదు చేసుకున్న అత్యంత పిన్నవయస్కునిగా యుఎఇకి చెందిన రెండేళ్ల భారతీయ బాలుడు రికార్డు సాధించాడు. తక్ష్ జైన్ అనే రెండేళ్ల పది నెలల బాలుడు తన తల నీలాలను క్యాన్సర్ రోగుల కోసం దానం చేయడానికి తన పేరు నమోదు చేసుకున్నట్లు గల్ఫ్ న్యూస్ తెలిపింది.

క్యాన్సర్ రోగుల కోసం తక్ష్ పెద్దక్క కూడా 2019లో తన కేశాలను దానం చేసిందని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తక్ష్ కూడా తన కేశాలను దానం చేయడానికి ముందుకు వచ్చాడని అతని తల్లి నేహా జైన్ తెలిపారు. ఇదే విషయం గురించి ఇంట్లో మాట్లాడుకుంటున్నపుడు విన్న తక్ష్ తాను కూడా తన అక్కలాగే కేశాలు ఇస్తానని చెప్పాడని, మరి కొద్ది కాలంలో కేశాలు బాగా పెరిగిన తర్వాత వాటిని దానం చేస్తామని గృహిణి అయిన ఆమె చెప్పారు. 1999లో స్థాపించిన ఎఫ్‌ఓసిపి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గురువారం కేశాల దానానికి సంబంధించిన ప్రచారాన్ని చేపట్టింది. ప్రస్తుతం యుఎఇలోని ఏడు పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News