Friday, May 17, 2024

డిసెంబర్ లోపు బోనస్ చెల్లిస్తాం

- Advertisement -
- Advertisement -

TSRTC

ఆర్‌టిసిలో ఉద్యోగ భద్రతపై వారంలో విధి విధానాలు
ఉత్తమ డ్రైవర్, మెకానిక్‌ల అవార్డుల ప్రదానోత్సవంలో ఎండి సునీల్ శర్మ వెల్లడి

హైదరాబాద్: టిఎస్‌ఆర్‌టిసి సంస్థలో విధు లు నిర్వహించే ఉద్యోగుల భద్రత పై సిఎంకెసిఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేశాల మేరకు సమగ్రమైన విధి విధానాలను వారం లోపు ఖరారు చేస్తామని మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ప్రకటించారు. శనివారం ఉదయం ఆర్‌టిసి కళా భవనంలో రాష్ట్ర స్థాయి కెఎంపియల్ సాధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్,మైకానిక్‌ల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ పరిధిలో పని చేయు ఉద్యోగులకు 100శాతం ఉద్యోగభద్రత కల్పించే విషయం పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతనఉన్నత స్థాయి సమావేశం జరిపామన్నారు.

పలు మార్పులు చేర్పులను పూర్తి చేసి, నూతన విధి విధానాలను వారం లోపు వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా తప్పులు చేసిన ఉద్యోగుల పై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఉద్యొగులను కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు సంస్థ చట్టాల మేరకు చర్యలను కూడా గైకొంటామన్నారు. హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన వనరుల పొదుపుపరిరక్షణ, కెఎంపియల్ సాధనలో టిఎస్‌ఆర్‌టిసి మిగితా రాష్ట్రాలకు రోల్ మాడల్‌గా ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల మూలంగా ఉద్యోగుల భద్రతకు నష్టం లేదని స్పష్టం చేశారు. గత 30 ఏళ్లుగా హెచ్‌పిసిఎల్ ఇంధన వనరుల పోదుపు-పర్యావరణ పరిక్షణ పై విశేషమైన కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ టిఎస్‌ఆర్‌టిసి పరిధిలో జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15 వరకు ఇంధన వనరుల పొదుపు మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ మేరకు ప్రతి డిపో నందు డిజీల్ ఆదా పై నూతన సాంకేతిక పరమైన అవగాహన కార్యక్రమాల మూలంగా కెఎంపియల్ 4.09 నుండి 5.15 మేర సాధించామన్నారు.

ఇదే తరహాలో భవిష్యత్తులో కెఎంపియల్‌ను 5.35 సాధిస్తే, రూ.1,384 కోట్ల డిజిల్ భారం లో 30 శాతం ఆదా సాధ్యమవుతుందన్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో ప్రతిభకనబర్చిన 11 మంది డ్రైవర్‌లకు కెఎంపియల్ అవార్డులను మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ చేతుల మీదు ప్రదానం చేశారు.ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో హెచ్‌పిసిఎల్ డిప్యూటి జనరల్ మేనేజర్ రోహిత్ గార్గ్, టిఎస్‌ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ పురుషోత్తం నాయక్, ఆర్థిక సలహాదారు రమేష్, టివి.రావు, రమేష్, రఘనాథ్ రావు తదితరులు పాల్గొన్నారు.

RTC Employees Will Be Paid Bonus Before December

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News