Sunday, April 28, 2024

అప్పు కోసం వెళ్తే…

- Advertisement -
- Advertisement -

a tea seller in Kurukshetra is now a bank defaulter

రూ 50 కోట్ల బకాయి తిప్పలు
కురుక్షేత్ర టీవాలాపై బ్యాంకు బాణం

కురుక్షేత్ర : హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ఓ టీవాలాకు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. కరోనా మహమ్మారితో తన టీకొట్టు సరిగ్గా నడవకపోవడంతో ఈ కురుక్షేత్ర టీవాలా రాజ్‌కుమార్ రుణం కోసం బ్యాంకును ఆశ్రయించారు. తొలుత ఆయన రుణం కోసం పెట్టుకున్న దరఖాస్తును బ్యాంకు అధికారులు తిరస్కరించారు. బ్యాంకుకు ఇప్పటికే రూ 50 కోట్ల రుణం బకాయి పడి ఉన్నందున కొత్త రుణం ఎలా ఇస్తారని పేర్కొంటూ రాజ్‌కుమార్ దరఖాస్తును తిరస్కరించారు. అయితే తనకు ఏకంగా రూ 50 కోట్ల రుణం ఉందని బ్యాంకు అధికారులు తెలియచేయడంతో చుట్టూ ఉన్న కరోనా తాకిడి కన్నా ఎక్కువ స్థాయిలో రాజ్‌కుమార్ కంగుతిన్నాడు.

కేవలం టీకొట్టుపైనే ఆధారపడి కుటుంబాన్ని లాగుకుంటూ వస్తున్న ఈ ఆసామీ ఇప్పుడు బ్యాంక్ వారి మాటల ప్రకారం ఇన్ని కోట్ల అప్పు ఎగవేతదారు అయిపొయ్యాడు. అయితే తాను తన టీకొట్టు, పిల్లల పోషణ భారం తప్ప వేరే విషయాలు తెలియని తనకు ఇంత రుణం ఏమిటని? ఇదెక్కడి నుంచి వచ్చిపడిందని ఇప్పుడు రాజ్‌కుమార్ బావురు మంటున్నాడు. తాను ఒక్కపైసా అప్పు తీసుకోలేదని , కేవలం అప్పు కావాలని దరఖాస్తు చేసుకున్నానని రాజ్‌కుమార్ చెపుతున్నారు. అది కూడా ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఇల్లు గడవడం కష్టం కావడంతో బ్యాంకు గుమ్మం తొక్కానని తెలిపారు. ఈ వ్యక్తి పంజాబ్ నేషనల్ బ్యాంకును రుణం కోసం ఆశ్రయించాడు. ప్రస్తుతం బ్యాంకు అధికారి ఒకరు ఈ 50 కోట్ల రుణ వ్యవహారంపై స్పందించారు.

రాజ్‌కుమార్‌కు నూ 50 కోట్ల అప్పు ఏమీ లేదని అయితే రుణాలకు సంబంధించిన వివరాల సేకరణ దశలో సిబిల్ స్కోర్ అనే ప్రక్రియ ఉంటుందని, ఈ క్రమంలో పాన్ కార్డు, ఆధార్‌కార్డుల నమోదు ఉంటుందని తెలిపారు. ఈ దశలోనే ఒకే పేరున్న వారి పేర్ల విషయంలో తలెత్తిన గందరగోళంతో ఈ రాజ్‌కుమార్ పేరిట ఇంత భారీ రుణం ఉన్నట్లు తేల్చి ఉంటారని, తాము సిబిల్ ఎజెన్సీ నుంచి వారం రోజులలో వివరణకు ఆదేశించామని బ్యాంక్ జిల్లా అధికారి హరిసింగ్ పత్రికలకు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News