Monday, April 29, 2024

ఊరమాస్ లారీ డ్రైవర్ పాత్రలో..!

- Advertisement -
- Advertisement -

Allu Arjun

 

‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ ఈ సినిమా కోసం పకడ్బందీగా స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. తాజాగా ఈ సినిమాలోని నటీనటుల గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా కథ శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాస్‌గా ఉండే ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడట. హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తుందట. ఇక తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఫారెస్ట్ ఇన్‌స్పెక్టర్ పాత్రను పోషిస్తాడని తెలిసింది.

ఈ సినిమాలో విలన్ పాత్రలకు జగపతి బాబు, కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టిని ఎంచుకున్నారట. జగపతిబాబు ఎంత స్టైలిష్‌గా ఉంటాడో రాజ్ దీపక్ శెట్టి అంతే స్టైలిష్‌గా ఉంటాడు. ఇక రాజ్ ఫిట్‌నెస్ చూస్తే టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్‌లు గుర్తుకు రావాల్సిందే. పాత్రల సంగతి ఇలా ఉంటే సుకుమార్ ఆస్థాన విద్వాంసుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. స్టైల్ విషయంలో ఎప్పుడూ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటూ స్టైలిష్ స్టార్ అని బిరుదు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో మొదటిసారి ఊర మాస్ పాత్రలో నటించనున్నాడు. అంతే కాకుండా బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడతాడనే అప్‌డేట్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Allu Arjun as Larry Driver
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News