Monday, April 29, 2024

ఇల్లు చక్కబెట్టే పనిలో బైడెన్ తోడుగా హారిస్

- Advertisement -
- Advertisement -

Biden Harris now focuses on major national issues

 

వైరస్ డాలర్‌లపై తక్షణ దృష్టి

వాషింగ్టన్ : ఎన్నికల ప్రచారం ఓట్ల సమీకరణ తరువాత విజయం దాదాపు ఖాయం చేసుకున్న బైడెన్ హారిస్ ఇప్పుడు ప్రధాన జాతీయ అంశాలపై దృష్టి సారించారు. పూర్తి స్థాయిలో శీతాకాలం సమీపించిన దశలో కరోనా వైరస్ ఉధృతి భయాందోళనను పరిగణనలోకి తీసుకున్నారు. ముందు ప్రజా ఆరోగ్య పరిరక్షణ, తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతలపై శ్రద్ధ వహించాలని సంకల్పించారు. రిపబ్లికన్ల హయాంలో ప్రెసిడెంట్ ట్రంప్ పాలనాతీరుతెన్నులతో ప్రధానంగా కోవిడ్ మహమ్మారిని ఆటకట్టించలేకపొయ్యారని బైడెన్ హారిస్‌లు విమర్శిస్తూ వచ్చారు. లాక్‌డౌన్ చర్యలతో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఉపాధి ఉద్యోగ అవకాశాలకు గండి పడింది. దీనితో ముందుగా వీటి విషయంలో స్పందించాల్సి ఉందని ఇప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీ అనివార్యంగా నడుంబిగించాల్సి వచ్చింది. జాతీయ ఆరోగ్య పరిరక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రాధాన్యతాక్రమాలని ఇరువురు నేతలు తెలియచేసుకున్నారు.

దేశాధ్యక్ష పదవి ఎన్నికల తుది ఫలితాల గురించి తాము ఎదురుచూస్తున్నామని అయితే ఇదే క్రమంలో పరిస్థితిని చక్కదిద్దే విషయంలో తాము జాప్యం చేసే వారిమి కాదని తెలియచేస్తున్నామని, ఈ మేరకు వెంటనే రంగంలోకి దిగుతామని తమ ప్రచార కార్యాలయాల నుంచి మాట్లాడుతూ బైడెన్ తెలిపారు. మొదటి రోజు నుంచే అత్యంత ప్రాధాన్యత దిశలో వైరస్ కట్టడికి రంగంలోకి దిగుతామని తేల్చిచెప్పారు. ఇప్పటికే వైరస్‌తో బలి అయిన ఏ వ్యక్తిని తాము తిరిగి తీసుకురాలేమని, అయితే ఇకపై వచ్చే కొద్ది నెలల్లో వైరస్‌తో అత్యధిక మరణాలు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యక్ష పదవిని చేపట్టేందుకు దాదాపుగా బలం సంతరించుకున్న కమలా హారిస్ ప్రజా ఆరోగ్యం, దేశ ఆర్థిక సంక్షోభ నివారణల విషయంలో ఇప్పటికే రెండు మూడు దఫాలుగా సంబంధిత నిపుణులతో సమావేశం అయ్యారు.

పరిస్థితిని సమీక్షించారు. తాము ఇప్పటి ఆర్థి పరిస్థితిపైనే ఆందోళన చెందుతున్నామని, ఇప్పటికే దేశవ్యాప్తంగా రెండుకోట్ల మందికిపైగా ఉద్యోగాలు కోల్పొయ్యారని, ఇక లక్షలాది మంది షట్‌డౌన్ పరిస్థితుల దశలో సరైన ఆదాయం లేక ఇప్పటికీ ఇంటి అద్దెలు కట్టలేని స్థితిలో ఉన్నారని, వారికి సరైన ఆహారం దక్కడం లేదని, వీటన్నింటిపైనా తాము దృష్టి సారించామని జో బైడెన్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News