Sunday, April 28, 2024

హెచ్-1వీసాల విషయంలో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Biden key decisions on H1 visa

 

ట్రంప్ ఆదేశాలు 60 రోజుల పాటు నిలిపివేత

వాషింగ్టన్: హెచ్-1 బి వీసాల విషయంలో అగ్రరాజ్యం అధినేత జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బి వీసాల విషయంలోట్రంప్ సర్కార్ గతంలో ఇచ్చిన దేశాల అమలుకు మరోసారి బ్రేక్‌లు వేశారు. ఈ మేరకు జో బైడెన్ టీం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లక్షలాది మంది ప్రవాసులు లబ్ధి పొందనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలుపొందేందుకు ట్రంప్ విశ్వప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో అమెరికన్లకు లబ్ధి చేకూర్చి తద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలని భావించారు. ఇందులో భాగంగా హెచ్-1బి వీసాలపై అమెరికా వచ్చే విదేశీయుల జీతాలను అమాంతం పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అమెరికా సంస్థలు విదేశీయులకు భారీ జీతాలు ఇచ్చుకోలేక.. స్వదేశీ పౌరులకు ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ భావించారు.

అయితే అప్పట్లో ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా దిగ్గజ సంస్థలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించడంతో ట్రంప్ ఇచ్చిన ఆదేశాలకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలో బైడెన్ టీం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ ఆదేశాలను దాదాపు 60 రోజుల పాటు పెండింగ్‌లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్-1 బి వీసాదారుల జీతాల పెంపు విషయంలో ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలను మే 14 వరకు అమలులోకి రాకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత కూడా ట్రంప్ ఆదేశాలను అమలు చేయాలా? వద్దా? అనే విషయాన్ని చర్చించనున్నట్లు పేర్కొంది.హెచ్-1 బి వీసాలను పొందే దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. కాగా బైడెన్ సర్కార్ తాజా నిర్ణయంతో ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News