Sunday, April 28, 2024

వెయ్యి కిలో మీటర్ల ప్రయాణం…. కార్మికుడిని చిదిమేసిన కారు

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఢిల్లీ నుంచి బిహార్‌కు బయలు దేరిన వలస కార్మికుడు కారు ప్రమాదంలో చనిపోయాడు. బిహార్‌కు చెందిన సఘీర్ అన్సారీ తన కార్మికులతో కలిసి సైకిల్‌పై వెయ్యి కిలో మీటర్ల ప్రయాణాన్ని మొదలు పెట్టారు. గత ఐదు రోజుల నుంచి సైకిల్ తొక్కుతూ తన స్వస్థలానికి చేరుకోవాలనుకున్నాడు, కానీ విధి వక్రీకరించింది. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో సమీపంలో ఆకలిగా ఉండడంతో ఒక్క దగ్గర ఆగారు. డివైడర్‌పై కూర్చొని వలస కార్మికులు టిఫిన్ చేస్తుండగా కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అన్సారి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో పది మంది గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అన్సారికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భారత దేశంలో జాతీయ రహదారుల వలస కార్మికుల ఆకలి కేకలు కనిపిస్తున్నాయి. ఇప్పటి కైన ఆ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రతి జిల్లా సరిహద్దులో జాతీయ రహదారులపై కార్మికులకు ఆహార సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి వంద కిలో మీటర్ల దూరానికి స్థానిక ఎంఎల్ఎ, ఎంపిలు ఆహార సదుపాయాలు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లో  లారీ ప్రమాదంలో ఆరుగురు వలస కార్మికులు మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News