Thursday, May 16, 2024

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం.. భూసేకరణ పనులు త్వరగా చేయాలి

- Advertisement -
- Advertisement -

Calvacurti project

 

మన తెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం – మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అధికారులు పెండింగ్ పనులను వెంటనే గుర్తించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు, ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణంపై హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. ఎంఎల్‌ఎలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏదుల రిజర్వాయర్‌ను వినియోగంలోకి తీసుకొస్తే కల్వకుర్తి ఎత్తిపోతల మీద భారం తగ్గుతుందన్నారు. – పనులలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే వెంటనే పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఏదుల రిజర్వాయర్‌తో పాలమూరు – రంగారెడ్డి తొలిఫలితం అందబోతుందని తెలిపారు. కల్వకుర్తి చివరి ఆయకట్టుకు నిర్దేశించినంత వరకు నీళ్లందాలని,- ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణంతోనే కల్వకుర్తి ఎత్తిపోతలకు న్యాయమన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందని తెలిపారు. ఆన్‌లైన్ రిజర్వాయర్లను త్వరగా ఫైనల్ చేయాలని, – వీటిని దశలవారీగా నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఇక ఫీడర్ ఛానళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, – కాల్వలను ఎవరు తెంపినా కఠినచర్యలు చేపట్టి కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలన్నారు. వేసిన ప్రతి పంట చేతికొచ్చేవరకు సాగునీరు అందిస్తామని, – మూడువేల క్యూసెక్కుల నీళ్లు ప్రస్తుతం కాలువల నుండి వస్తున్నాయని తెలిపారు. మరో వెయ్యి క్యూసెక్కుల నీళ్లు తీసుకునేందుకు ఏం చేయాలో అధికారులు ప్రణాళిక సిద్దం చేయాలన్నారు.- వట్టెం నుండి నీళ్లు తీసుకుంటేనే కల్వకుర్తి ఆయకట్టుకు న్యాయం జరుగుతుందని, – కర్నెతండా, మార్కండేయ లిఫ్ట్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. –
ఖమ్మంలో రైతుబంధు లోపాలు సరిదిద్దండి

రవాణా శాఖ మంత్రి పువ్వాడ, ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య
ఖమ్మం జిల్లాలో రైతుబంధు లోపాలను సరిదిద్దాలని, – రైతులకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇప్పించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పొలాల హెచ్చుతగ్గుల నేపథ్యంలో గతంలో రైతుబంధు చెక్కులు వెనక్కి తీసుకున్నారని,- వాటిని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదన్నారు. ఖమ్మం జిల్లాలో రుణాలు షెడ్యూల్ చేసిన రుణమాఫీ లేని 20 వేల మంది రైతులకు దాదాపు రూ.90 కోట్లు సిఎం కెసిఆర్ మంజూరు చేశారని తెలిపారు. ఆర్థిక శాఖ ద్వారా ఆ డబ్బులు రైతుల ఖాతాలలో పడేవిధంగా చూడాలని మంత్రికి తెలిపారు. వేంసూరు, సత్తుపల్లి, లచ్చన్నగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాలన్నారు. -ఈ సంఘాల పరిధిలో దాదాపు 6 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారన్నారు.

 

Calvacurti project is life support for farmers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News