Monday, April 29, 2024

తెలంగాణ అభివృద్ది మోడీకి కనిపించడం లేదా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వరంగల్ జిల్లా వేదికగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొనసాగిన ప్రధాని మోడీ ప్రసంగంపై హైదరాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ ఇంచార్జి దాసోజు శ్రవణ్ ఘాటూ విమర్శలు చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కలను తన్నుకుపోయి ఇప్పుడు రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్‌కు శ్రీకారం చుట్టి తెలంగాణకు ఏదో గొప్ప వరం ఇచ్చినట్లు చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. మూడోసారి కెసిఆర్ ను గెలిపించుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతుంటే మోడీ మాత్రం తెలంగాణ సర్కార్ కరప్షన్ కు పాల్పడుతుందని అనడం హాస్యాస్పదంగా ఉందని కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం 40 శాతం కరప్షన్ కు పాల్పడుతుందని ప్రజలు గద్దె దించారని విమర్శించారు.

నేడు తెలంగాణ అంటే భారత దేశానికే తలమానికంగా ఉందని వరి ఉత్పత్తి లో గాని , కరెంట్ వినియోగంలో గాని , ఉత్పత్తిలో గాని ఇలా ఎందులో చూసిన తెలంగాణ నెం వన్ స్థానంలో ఉండేలా సిఎం కేసీఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి,కేసీఆర్ కిట్ ,షాదీ ముబారక్, మన ఊరు – మన బడి , రైతుబంధు , దళిత బంధు , బస్తి దవాఖాన, మిషన్ భగీరధ ఇలా ఎన్నో పధకాలు తెచ్చి తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే మోడీకి కనిపించడం లేదాని ప్రశ్నించారు. రూ. 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయిన మోడీ సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ అనే నినాదం గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్‌గా మారిపోయిందని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి, కేంద్ర 16 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను నింపకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలను ప్రైవేటుపరం చేస్తున్న ప్రధానమంత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైన మాట్లాడడం గురువింద సామెత కన్నా హీనంగా ఉందన్నారు. కేవలం అదానీ సంస్థలకే దోచిపెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నాడని, తెలంగాణ యువతకు లక్షలాది ఉద్యోగాలను అందించే అవకాశం ఉన్న ఐటిఐఆర్ ప్రాజెక్టును ప్రభుత్వంలోకి రాగానే రద్దు చేసిన మోడీ ఇక్కడి ఉన్నత విద్యావంతులకు చేసిన మోసాన్ని ఎన్నటికీ తెలంగాణ యువత మరిచిపోదని, తెలంగాణ వ్యతిరేఖి మోడీ అని ఆరోపించారు. చివరికి తిరుపతి వేంకటేశ్వరస్వామిని సైతం మోసం చేసిన మోడీ, తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసే కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. ఏడుకొండల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తానని ఎందుకు మాట తప్పడని ప్రశ్నించారు. మోడీ వ్యక్తుల గురించి ఆలోచిస్తే సిఎం కెసిఆర్ దేశ ప్రజల బాగుగోలు గురించి ఆలోచిస్తారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News