Monday, April 29, 2024

మునుపటి గ్యాస్ సబ్సిడీకి కసరత్తు

- Advertisement -
- Advertisement -

Central govt working on gas subsidy policy

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు మునుపటి వంటగ్యాసు సబ్సిడీ ఉన్నట్లా? లేనట్టా అనే అంశం జనంలో పెద్ద మీమాంసకు దారితీసింది. చాలా నెలలుగా వంటగ్యాసు వినియోగదారులకు సబ్సిడీలు అందడం లేదు. ఇంతకు ముందటి లాగా ఎప్పటికప్పుడు వారిబ్యాంకు ఖాతాలలోకి సబ్సిడీ సొమ్ము చేరడం లేదు. ఈ దశలోనే ఇప్పుడు ఎల్‌పిజి సబ్సిడీ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షకు దిగింది. వంటగ్యాసుకు సంబంధించి నూతన సబ్సిడీ విధానం ఖరారుకు కేంద్రం సిద్ధం అయినట్లు ఇప్పుడు భారీ స్థాయిలో సాగుతున్న సంప్రదింపుల క్రమంతో తేటతెల్లం అయింది. కొవిడ్ ఇతర కారణాలతో సబ్సిడీలను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ఓసారి అసమగ్ర ప్రకటన వెలువరించింది. అయితే సబ్సిడీ పద్ధతి నిలిపివేసేది లేదని కూడా తెలిపింది. ఇప్పుడు సామాన్య జనం ఓ వైపు పలు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన దశలో వేయి రూపాయలు మించి ధరలకు సిలిండర్లు కొనుక్కునే పరిస్థితి లేదని, సబ్సిడీలు అందాల్సిందేనని కోరుతున్నారు. వంటగ్యాసు ధరల భారంతో కమ్ముకుంటున్న తీవ్ర అసంతృప్తిని పరిశీలనలోకి తీసుకున్న కేంద్రంలోని బిజెపి సర్కారు వంటగ్యాసు సబ్సిడీని తిరిగి ప్రజల ఖాతాలలోకి చూపేందుకు, క్రమేపీ వంటగ్యాసు ధరలను సాధ్యమైనంతగా తగ్గించేందుకు కసరత్తులు ఆరంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News