Monday, April 29, 2024

పిల్లల్లో యాంటీబాడీస్, వైరస్ సయ్యాట

- Advertisement -
- Advertisement -

Children can have COVID-19 antibodies

వాషింగ్టన్: రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలను కూడా కరోనా వైరస్ పీడిస్తోంది. పిల్లల్లో అత్యధికంగానే కోవిడ్ 19 నివారణానికి ఉపయోగపడే మూలకణాలు ఉంటున్నాయి. అయితే వీరికి కూడా ఎక్కువగా కరోనా వైరస్ సోకుతోంది. ఇటీవలి కాలంలో పిల్లలపై జరిపిన అధ్యయనంలో ఈ రెండు పరస్పర వైరుద్ధ అంశాలు వెలుగులోకివచ్చాయి. బాలల్లో గణనీయ మోతాదులోనే రోగనిరోధక శక్తి ఉంటోందని, అయితే వారినీ వైరస్ ఎందుకు సోకుతోందనేది ప్రశ్నార్థకం అయింది. పెద్ద వయస్సు మీదబడని వారిలో యాంటీబాడీస్, వైరస్‌లు సహజీవనం చేస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. అమెరికాలో మార్చి 13వ తేదీ నుంచి జూన్ 21 మధ్యకాలంలో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో యాంటీబాడీస్‌పై పరీక్షలు నిర్వహించారు. 215 మంది కరోనా వచ్చిన వారిని పరీక్షించారు.

ఈ క్రమంలో వారిలో నివారక కణాలు , వైరస్ పోటాపోటీగానే ఉన్న వైనాన్ని గుర్తించారు. ఇక్కడి ఆసుపత్రిలో కరోనా చికిత్సకు దాదాపు 6వేల మంది పిల్లలను చేర్పించారు. ఈ ఆసుపత్రినే శాస్త్రజ్ఞుల బృందం తమ అధ్యయన వేదికగా ఎంచుకుంది. ఆసుపత్రికి చెందిన పరిశోధకులు కూడా అధ్యయనంలో పాలుపంచుకున్నారు. పిల్లల్లో యాంటీబాడీస్‌కు, వైరస్‌కు ఏకకాలంలో జరిపిన పరీక్షలలో ఈ రెండూ బాగానే ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా వైరస్‌లకు సంబంధించి మనిషి శరీరంలో యాంటీబాడీస్ ఉన్నట్లు అయితే వైరస్ ఎక్కువ కాలం మనజాలదు. నశిస్తుంది. అయితే ఈ పిల్లల్లో ఈ రెండూ సహజీవనం చేస్తున్నట్లు గుర్తించామని ఈ అధ్యయన బృందం సారధి బురాక్ బహార్ తెలిపారు. అధ్యయనం వివరాలను పిల్లల వైద్య విజ్ఞాన పత్రికలో ప్రచురించారు. పిల్లల్లో ఈ విధంగా ఈ రెండూ ఉండటం విచిత్రమే అని, ఇక తాము అధ్యయనంలో తదుపరి దశలో ఈ విధంగా ఉన్న వారి నుంచి వైరస్ ఇతరులకు సోకుతుందా? అనేది నిర్థారించుకుంటామని ఆమె చెప్పారు.

యాంటీబాడీస్ ఉండటం అంటే ఇమ్యూనిటీ సంతరించుకుని ఉన్నట్లే, అయితే ఇదే క్రమంలో వైరస్ పొంచి ఉండటంతో ఈ పిల్లలు ఎంతవరకూ కరోనా కాటుకు గురి కాకుండా ఉంటారు? యాంటీబాడీస్‌ను ఈ కరోనా మూలకణాలు దెబ్బతీస్తాయా? అనేది తేల్చకుంటామని, దీనిని బట్టి తాము ఇకపై ఇమ్యూనిటీ ఉన్న వారిని కూడా కరోనా దెబ్బతీస్తుందీ లేనిదీ నిర్థారించుకునేందుకు వీలుంటుందని వివరించారు. యాంటీబాడీస్ తటస్థీకరణం ద్వారా వ్యక్తిని కరోనా బారిన పడకుండా చేయవచ్చునని, అయితే దీనికి రోగికి అత్యంత సునిశిత చికిత్స పర్యవేక్షణ అవసరం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News