Monday, April 29, 2024

రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్‌ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి లను అభ్యర్థులుగా సిఎం కెసిఆర్ ప్రకటించారు. గురువారం ప్రగతి భవన్‌లో సురేష్‌రెడ్డి, కె.కేశవరావులకు సిఎం కెసిఆర్ బిఫారాలు ఇచ్చారు. టిఆర్‌ఎస్ నుంచి రాజ్యసభకు పోటీచేస్తున్న ఈ ఇద్దరు అభ్యర్థులు శుక్రవారం రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి నామినేషన్‌లు అందజేయనున్నారు. ఒకో అభ్యర్థిని 10 మంది శాసనసభ్యులు ప్రతిపాదించా ల్సి ఉంటుంది. 16న నామినేషన్లు పరిశీలన, 18లోగా ఉపసంహరణ, 26న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో గరికపాటి రామ్మోహన్ రావు, కెవిపి పదవీకాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీలకు ఈ ఎన్నికలు జరుగుతున్నా యి. అయితే ఎపి రాజ్యసభ కోటాలో ఉన్న కె.కేశవరావు పదవి కాలం కూడా ఏప్రిల్‌తో ముగుస్తుండటంతో ఆయనకు తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసేందుకు సిఎం కెసిఆర్ అవకాశం కల్పించారు.

కెకె కాంగ్రెస్ నుంచి ఒకపర్యాయం, టిఆర్‌ఎస్ నుంచి ఒక పర్యాయం రాజ్యసభకు ఉఎన్నికయ్యారు. అయితే రెండవసారి టిఆర్‌ఎస్ నుంచి గెలిచి ఆంధ్ర కోటాలో పేరు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మూడవ సారి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. కెఆర్ సురేష్ రెడ్డి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2004 నుంచి 2009 వరకు స్పీకర్‌గా విధులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బాల్కొండ నియోజకవర్గం నుంచి 1989, 1994, 1999,2004లో శాసనసభ్యుడుగా గెలిచారు. అయితే 2009లో ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి 20017లో టిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే 2019 సాధారణ ఎన్నికల్లో అవకాశం రాలేదు. సరైన సమయంలో గుర్తింపు ఇస్తామని సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు సురేష్ రెడ్డికి ప్రస్తుతం రాజ్యసభకు అవకాశం కల్పించారు. రాజ్యసభకు జరగనున్న ఇద్దరు అభ్యర్థుల ఎన్నికలు కేవలం నామమాత్రమే, శాసన సభలో టిఆర్‌ఎస్‌కు 104 మంది సభ్యుల మేజారిటీ తో పాటు ఎంఐఎం సభ్యుల సహకారం ఉన్న టిఆర్‌ఎస్ సు లువుగా ఇద్దరి అభ్యర్థులను గెలుచుకుంటుంది. ఇతర పార్టీలకు పోటీచేసే అభ్యర్థులను ప్రతిపాదించేందుకు కనీ సం 10 మంది శాసనసభ్యులు లేకపోవడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి కేవలం ప్రేక్షక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు తోనే కెకె,సురేష్ రెడ్డి గెలవనున్నారని టిఆర్‌ఎస్ నాయకులు చెప్పారు.

కెటిఆర్‌ను కలిసిన కెకె, సురేష్‌రెడ్డి
టిఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కె.కేశవరావు, కెఆర్.సురేష్ రెడ్డి మర్యాద పూర్వకంగా గురువారం ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి, కె.టి. రామారావును కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ వారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కె.కేశవరావు, సురేష్ రెడ్డి కలిశారు. శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఈసందర్భంగా స్పీకర్‌కు చెప్పారు. స్పీకర్ పోచారం వారికి అభినందనలు తెలిపారు.

CM KCR Announced Rajya Sabha TRS Candidates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News