Monday, April 29, 2024

కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా

- Advertisement -
- Advertisement -

బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే

‘ఇయే ఆయా’ పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు

* కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు
* అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిఎస్‌టి పేరుతో, ఇప్పుడు బిజెపి జిఎస్‌టి పేరుతో రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు ఎగనామం     పెట్టాయి, పన్నుల రూపంలో కేంద్రానికి ఏటా రూ.50వేల కోట్లు ఇస్తుంటే అక్కడ నుంచి వచ్చేది రూ.24 వేల కోట్లు కూడా     లేదు

* కేంద్ర పథకాల ద్వారా వస్తున్నది ఏ సంవత్సరమూ రూ. 10వేల కోట్లు దాటలేదు
* చట్ట ప్రకారం రావాల్సిన జిఎస్‌టి పరిహార మొత్తానికి దిక్కే లేకుండా పోయింది
* దేశాన్ని సాదుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో ఉంది

 

మన తెలంగాణ/హైదరాబాద్: దేశాన్ని పాలించడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు రెండూ అట్టర్‌ప్లాఫ్ అయ్యాయయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలేనని విమర్శించారు. తెలంగాణ సదువు రానోళ్ల రాష్ట్రం కాదని, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన రూ.3,900 కోట్ల పైచిలుకు పన్ను డబ్బులు కేంద్రం నుంచి రాలేదన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్ అసెంబ్లీలో మాట్లాడా రు. కాంగ్రెస్‌ను కాదని, బిజెపి ఏదో చేస్తుందని ప్రజలు నమ్మి ఓటేశారని, అయితే బిజెపి కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. కేంద్రం నుం చి వచ్చే నిధులను ఇవ్వకపోగా వాటికి బదులుగా రూ. 1400 కోట్లు పైన అప్పులు తీసుకోవాలని కేంద్రం సూ చించిదని క్యా అయా అంటే ఇయే అయా.. కిత్ నే అయే బోలో.. కిసికా బాప్‌కా హై అంటూ ఎద్దేవా చేశా రు. దేశంలో పన్నుల పద్ధతి, ఎవరు వసూలు చేయాలనే అంశాలను రాజ్యాంగంలో పేర్కొన్నారని చెప్పారు. రెం డు, మూడు రకాల పన్నులు వసూలు చేసే బాధ్యతను మాత్రమే కేంద్రానికి ఇచ్చారన్నారు. కేంద్రం వసూలు చేసే కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చమెత్తుకునేది కాదని, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలకు ఆ వాటా ఇవ్వాల్సిందేనన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం సిఎస్‌టి, ఇప్పుడు బిజెపి జిఎస్‌టి పేరుతో రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయాలు ఎగనామం పెట్టారని విమర్శించారు. కేంద్రం నుంచి ఎంత వచ్చిందో చెప్పాలని అంటున్న రాజాసింగ్ అసలు వాస్తవాలు తెలుసుకోవాలని, ఇష్టారీతిన మాట్లాడితే కుదరదని సూచించారు. ఇదే విషయం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి ఏదో మాట్లాడి పోతే లెక్క చెప్పాలని, తాను రాజీనామాకు కూడా సిద్ధమేనని ప్రకటించినట్లు గుర్తు చేశారు. జిఎస్‌టి పరిహారం అనేది చట్ట ప్రకారం రావాల్సిందని, వాటికే దిక్కులేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా అనే ది కేంద్ర బడ్జెట్‌లో ఇంత అని చూపిస్తారని, దానిమీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ను రూపొందించుకుంటాయన్నారు. ఈ దేశాన్ని సాదే ఐదారు రాష్ట్రాలేనని మరోమారు స్పష్టం చేశారు. అందులో తెలంగాణ మొద టి మూడు స్థానాల్లోనే ఉంటుందన్నారు. కేంద్రానికి పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి రూ.50 వేల కోట్ల ఆ దాయం ఇస్తుంటే.. తెలంగాణకు వచ్చేది రూ.24 వేల కోట్లు కూడా లేవని ఆయన వివరించారు. ఇక కేంద్ర ప్రాయోజిక పథకాల ద్వారా తెలంగాణకు వచ్చే మొత్తం ఏ ఒక్క ఏడాదిలోనూరూ.10వేల కోట్లు దాటలేదన్నారు.
కాంగ్రెస్ సమీక్షించుకోవాల్సిందే
కాంగ్రెస్ నేతలు ప్రజల నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో ఇప్పటికైనా సమీక్షించుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి చెందుతున్న కాంగ్రెస్ నేతలు, ప్రజలు ఎందుకు ఓటు వేస్తాలేరో తెలుసుకోవాల్సింది పోయి.. మూస ధోరణిలో తమపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ఫలితాలు చూసి కూడా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు అందరికీ ఉంటుందని..అలా అని అర్థరహిత విమర్శలు చేయడం సరికాదని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నారు.
భాజప్తా పౌల్ట్రీకి ఇస్తాం
పౌల్ట్రీరంగం కుప్పకూలిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. నల్లగొండకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా తమ నేతలు తెలియకుండా మాట్లాడుతున్నారని, మంత్రి ఈటలకు ఫోన్ చేసి చెప్పారని సిఎం పేర్కొన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోన్న పౌల్ట్రీ రంగానికి రాయితీలు ఇస్తే, మార్క్‌ఫెడ్ నుంచి మక్కలు విక్రయిస్తే కుంభకోణం జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన కోళ్లు, గుడ్లు ఇతర రాష్టాలకు పోతాయని, కరోనా రాలేదని అయినా ఆ ప్రభావం వాటిపై పడిందన్నారు. పౌల్ట్రీని ఆదుకునేందుకు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు అయినా ఇస్తామని బెజప్తా కాదని, భాజప్తా ఇస్తామని తెలిపారు. మక్కలు, వరిధాన్యం రైతుల దగ్గర నుంచి మద్ధతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలలో ఇంకా ఎక్కువే ప్రోత్సాహకాలు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో వృద్ధి బాగుందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పిందని.. కాగ్ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. పారిశ్రామిక రాయితీకి రూ.1500 కోట్లు ఎందుకు ఇస్తం.. ఉట్టిగానే ఇవ్వం కదా అని ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు, రాష్ట్ర వృద్ధి పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండేళ్లకు తెలంగాణకు ఒక కంపెనీ వచ్చిందని, అయితే దానిని మహారాష్ట్ర సిఎం హైజాక్ చేసి రూ.3 వేల కోట్ల ప్రోత్సాహకం ఇచ్చి, వారి రాష్ట్రానికి తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు.

CM KCR Specch in Telangana Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News