Friday, May 17, 2024

మైండ్‌స్పేస్ ఉద్యోగికి కరోనా సోకలేదు: ఈటెల

- Advertisement -
- Advertisement -

Minister Etela Rajender

 

హైదరాబాద్: కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం ఈటెల  మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతతో పని చేస్తోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి పరిస్థతి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ గాలితో వచ్చేది కాదని, మన దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా లేదని, కరోనా వైరస్‌పై అతిగా స్పందించకండని ఈటెల సూచించారు. మైండ్‌స్పేస్ ఉద్యోగికి కరోనా సోకలేదని, ఇప్పటిదాకా ఒకే ఒక వ్యక్తికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని, పాజిటివ్ రిజల్ట్ వ్యక్తి కూడా దుబాయ్ నుంచి వచ్చాడన్నారు. తెలంగాణలో ఒక్కరికి కరోనా సోకలేదని, లేనిపోని అనుమానాలతో టెస్టుల కోసం రావొద్దని ప్రజలకు సూచించారు. కరోనా సోకిన వ్యక్తి మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ఈటెల తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నన్ని మౌళిక సదుపాయాలు దేశంలోనే ఎక్కడా లేవన్నారు.

 

Corona affected person discharge with in two days
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News