Thursday, May 9, 2024

కరోనా కరుకుదనం

- Advertisement -
- Advertisement -

గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా
నమోదైన కరోనా కేసులు

తేదీ కేసుల సంఖ్య
మే 17 4,987
మే 18 5,242
మే 20 5,611
మే 21 5,609
మే 22 6,654

కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న టాప్ 5దేశాల జాబితాలోకి భారత్
గత ఐదు రోజుల్లో నాలుగు వేల నుంచి 6వేలకుపైగా చేరుకున్న నమోదిత కేసుల సంఖ్య
గడిచిన 24గంటల్లో 6,654 మంది కరోనా బాధితులు
ఊరటనిస్తున్న రికవరీ రేటు

Corona cases more increased in India

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే నాలుగు వేల నుంచి క్రమంగా ఆరు వేల సంఖ్యలోకి వెళ్లిపోయింది. వారం రోజులుగా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. దీంతో ఒక్క రోజులోనే కేసుల సంఖ్య అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాల్లో భారత్ టాప్5లో నిలిచింది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత స్థానంలో భారత్‌లోనే అధిక కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. మే మాసం ఆరంభంలో 2వేలకు పైగా కేసులు నమోదైతే..

మొదటి వారంలో ఆ సంఖ్య 3వేలకుపైగా ఉంది. ఇక గత వారం రోజులుగా 5 నుంచి 6వేల కేసులకు చేరుకున్నాం. గడిచిన 24గంటల్లోనైతే ఆ సంఖ్య 6,654. దేశంలో తొలుత కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో జరపడం వల్ల కేసుల కూడా తక్కువగానే వెలుగుచూశాయని, ప్రస్తుతం రోజుకు లక్షకుపైగా టెస్టులు జరుపుతున్న నేపథ్యంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం భారత్‌కు పెద్ద ఊరట. ప్రస్తుతం కోలుకుంటున్న వారి రేటు 41.39శాతంగా ఉంది. శనివారంనాటికి 51, 783 కొవిడ్ బారి నుంచి కోలుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

24 గంటల్లో 137 మరణాలు

శనివారం కోవిడ్19 వల్ల 137మంది మరణించడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3720కి చేరుకున్నది. 24 గంటల్లో కొత్తగా 6654 కేసులు నమోదు కాగా, మొత్తం కేసులు లక్షా 25 వేల 101కి చేరాయి. బాధితుల్లో 51,783మంది కోలుకొని ఇళ్లకు వెళ్లగా 69,597మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. రికవరీ రేట్ 41.39 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 137 మరణాల్లో మహారాష్ట్రలో 6౩, గుజరాత్‌లో29,ఢిల్లీలో 14, ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, బెంగాల్‌లో 6, తమిళనాడులో 4, రాజస్థాన్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 2, ఆంధ్రప్రదేశ్‌లో 2 హర్యానాలో ఒకటి నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య మహారాష్ట్రలో 1517, గుజరాత్‌లో802, మధ్యప్రదేశ్‌లో 272, బెంగాల్‌లో 265, ఢిల్లీలో 208, రాజస్థాన్‌లో 153, ఉత్తర్‌ప్రదేశ్‌లో 152, తమిళనాడులో 98, ఆంధ్రప్రదేశ్‌లో 55, తెలంగాణలో 45కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య మహారాష్ట్రలో 44,582, తమిళనాడులో 14,753, గుజరాత్ లో 13,268, ఢిల్లీలో 12,319, రాజస్థాన్‌లో 6,494, మధ్యప్రదేశ్‌లో 6170, ఉత్తర్‌ప్రదేశ్‌లో 5,735, బెంగాల్‌లో 3332, ఆంధ్రప్రదేశ్‌లో 2709, బీహార్‌లో 2177, పంజాబ్‌లో 2029, తెలంగాణలో 1761,కర్నాటకలో1743, జమ్మూకాశ్మీర్‌లో 1489, ఒడిషాలో 1189, హర్యానాలో1067, కేరళలో 732, జార్ఖండ్‌లో 308, అస్సాంలో 259, చండీగఢ్‌లో 218, త్రిపురలో 175, ఛత్తీస్‌గఢ్‌లో 172, హిమాచల్‌ప్రదేశ్‌లో 168, ఉత్తరాఖండ్‌లో 153, గోవాలో 54కు చేరుకున్నాయి. మరో 1899 కేసుల్ని ఏ రాష్ట్రానివన్నది ఐసిఎంఆర్ నిర్ధారిస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News