Sunday, April 28, 2024

కరోనాకు వ్యాక్సిన్: చైనా శాస్త్రవేత్తలు

- Advertisement -
- Advertisement -

vaccine

 

బీజింగ్: కరోనా వైరస్‌కు చైనా దేశం  వ్యాక్సిన్  కనిపెట్టింది. తాజాగా భారత్‌కు చెందిన కోతులపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించింది. వ్యాక్సిన్ ఇచ్చిన వారం రోజుల తరువాత కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చిందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. బీజింగ్‌లోని సినోవా బయోటెక్‌లో శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ కనుగొన్నట్టు సమాచారం. కరోనా వైరస్ తో పోరాడే యాంటి బాడీలు ఈ వ్యాక్సిన్ లో ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన మూడు వారాలకు టెస్టు చేయగా కోతులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని, కరోనా టెస్టులో నెగటివ్ వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణ వైరస్‌లు మీద కూడా ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఎప్రిల్ 15 నుంచి కరోనా బాధితులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. ఇజ్రాయిల్, ఇటలీ దేశాలు కూడా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టామని చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News