Monday, April 29, 2024

గ్రేటర్‌లో డేంజర్ బెల్స్

- Advertisement -
- Advertisement -

Coronavirus danger bells in greater hyderabad

హైదరాబాద్: మహానగరం కరోనా మహమ్మారితో మరోసారి వణికిపోతుంది. ఏవైపు నుంచి వైరస్ ప్రాణాలను బలిగొట్టుందని ప్రజలు హడలిపోతున్నారు. గత పక్షం రోజుల నుంచి పక్క రాష్ట్రామైన మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు పెరగడంతో అక్కడ పలు పట్టణాలు దశలవారీగా లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి రోజుకు వేలాదిమంది రాకపోకలు సాగిస్తుండటంతో గత వారం రోజుల నుంచి రాజధాని నగరంలో కరోనా విజృంభణ చేస్తూ రోజుకు 100పైగా కేసులు నమోదైతున్నాయి. ఈసారి పాఠశాలు, కళాశాలలు, వసతిగృహాల్లో వైరస్ విరుచుకపడుతుంది. వందలాదిమంది ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. గడిచిన వారంలో ముందుగా నాగోల్‌లోని మైనార్టీ వసతిగృహాంలో 36మంది సోకగా, తరువాత కూకట్‌పల్లిలో ఓప్రైవేటు కళాశాల్లో 15మంది, రాజేంద్రనగర్ ఎస్సీ హాస్టల్ 26, బోయిన్‌పల్లిలో ప్రభుత్వ హాస్టల్ 40, హయత్‌నగర్ స్కూల్ 42, కంటోన్మెంట్‌లో ప్రభుత్వ పాఠశాలలో 35మంది, తాజాగా మంగళవారం షాపూర్‌నగర్‌లో 22మందికి కరోనా వైరస్ సోకింది.

వీరిని సమీప ఆసుపత్రుల్లో చేర్చి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభించిన తరువాత నిర్వహకులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ రెక్కలు కట్టుకుంటుందంటున్నారు. సెకండ్ వేవ్‌లో ఎక్కువ శాతం కేసులు స్కూళ్లలో నమోదు కావడంతో తల్లిదండ్రులను చిన్నారులను బడికి పంపడంలేదు. వైరస్ రోజు రోజుకు పెరగడంతో ప్రభుత్వం పాఠశాలలు మూసివేయాలని విద్యార్ది సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వ విద్యాశాఖ అధికారులతో సమావేశమై కరోనాను నియంత్రించేందుకు చర్యలు వేగం చేస్తున్నట్లు పేర్కొంటూ నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు మూసివేయాలని విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు. విద్యార్దులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్‌లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయన్నారు.

కరోనా పెరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అదే విధంగా నగరంలో వైద్యశాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలో కరోనా టెస్టులు పెంచింది. మూడు రోజుల నుంచి పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరిగిందని వెల్లడిస్తున్నారు. కరోనా వైద్యచికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్దం చేస్తూ రోగులకు సేవలందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మహమ్మారి మరింత విస్తరించే చాన్స్ ఉందని జిల్లా వైద్యాధికారులు భావిస్తున్నారు. నగర ప్రజలు అత్యవసర పరిస్దితుల్లోనే బయటకు వెళ్లాలని, ముఖానికి మాస్కులు, శానిటైజర్‌తో పాటు, వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించాలని, కరోనా టీకా వచ్చిందని వైరస్ పట్ల నిర్లక్షం వహిస్తే ప్రాణాలకు ముప్ప తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News