Friday, May 17, 2024

కేరళ లాటరీలో రూ.12 కోట్లు పట్టేశాడు!

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: అతడో దినసరి కూలీ. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. భార్య, ఇద్దరు పిల్లల పోషణ భారం అతడిదే. అయితే..అదృష్టదేవత అతడిని వరించింది. లాటరీ రూపంలో రూ. 12 కోట్లు లభించాయి. ఇది కేరళలోని కన్నూర్ జిలాల మలూర్ కైతచల అనే గ్రామంలోని పురలిమాల కురిచియా అనే గిరిజన వాడకు చెందిన 55 ఏళ్ల పురున్నన్ రాజన్ కథ. మూడు వారాల క్రితం బ్యాంకులో రుణం తీసుకునేందుకు కూతుపరంబ వెళుతున్న రాజన్ దారిలో లాటరీలు అమ్మే షాపు చూసి తన ఉబలాటాన్ని అదుపుచేసుకోలేకపోయాడు. లాటరీల పిచ్చి చిన్నప్పటి నుంచి అతనికి ఉంది. గతంలో రూ.2000 వరకు లాటరీ అదృష్టం అతడిని వరించింది. పయ్యన్ ఏజెన్సీస్‌లో రూ.300 పెట్టి బంపర్ లాటరీ కొన్న రాజన్ ఆ విషయాన్ని భార్య తిడుతుందన్న కారణంతో ఆమెకు కూడా చెప్పలేదు. సోమవారం లాటరీ ఫలితాలు వెలువడ్డాయి.

కూతుపరంబలో ఎవరికో లాటరీలో ప్రథమ బహుమతి దక్కిందన్న వార్త బయటకు పొక్కడంతో రాజన్ తన లాటరీ టిక్కెట్ నంబర్ చూసుకున్నాడు. అందులో తన టిక్కెట్‌కే ఫస్ట్ ప్రైజ్ రావడం చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. తన జీవితం ఇంత త్వరగా మారిపోతుందని అతడు కలలో కూడా ఊహించలేకపోయాడు. వెంటనే లన టిక్కెట్‌ను కేరళ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న మలూర్ సర్వీస్ సహకార బ్యాంకులో డిపాజిట్ చేశాడు. తన పెద్ద కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పు ఇంకా తీరలేదని, దాన్ని ఈ లాటరీ డబ్బుతో తీర్చేస్తానని రాజన్ అంటున్నాడు. అలాగే 12వ తరగతి చదువుతున్న తన చిన్న కుమార్తె పై చదువులకు ఇక ఆటంకం ఉండదని, డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్న తన కుమారుడికి ఉపాధి లభించినట్లేనని రాజన్ చెబుతున్నాడు. సగం కట్టి వదిలేసిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు కష్టాలలో ఉన్న తోటి వారిని కూడా ఆదుకుంటానని రాజన్ చెబుతున్నాడు.

Daily wage labourer wins Rs 12 cr lottery

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News