Monday, April 29, 2024

ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: అర్హులైన కుటుంబాలకు దళితబంధు ఇచ్చితీరుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు సిఎం కెసిఆర్ సభ జరుగుతోందన్నారు. రైతు బంధు విషయంలో అధికారులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16 పండుగ వాతావరణంలో దళితబంధు ప్రారంభిస్తామన్నారు. ప్రతీ ఊరువాడా డప్పుచప్పుళ్లతో సిఎం కెసిఆర్‌కు స్వాగతం పలుకుతుందన్నారు. సిఎం కెసిఆర్ చేతుల మీదుగా 15 మంది లబ్ధిదారులకు దళితబంధు ఇస్తామని హరీష్ ప్రకటించారు. దళిత బంధుకు హుజూరాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలియజేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు అందుతుందన్నారు. దళిత బంధు విషయంలో ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా దళితబంధు ఆగదన్నారు. తాము దళితబంధు ఇచ్చిన తరువాత ప్రతి పక్షాల కుట్రలు వాళ్లకే తగులుతాయని శాపనార్థాలు పెట్టారు. సోషల్ మీడియాలో పెట్టి ఒక్క రోజు ఆనందం పొందొచ్చని, ఇచ్చిన పేరు కెసిఆర్ ప్రభుత్వానికి శాశ్వతంగా మిగిలిపోతుందన్నారు. కేంద్రం ఉన్న బిజెపి ప్రభుత్వం చేయదని, చేసే ప్రభుత్వానికి అడ్డు తగులుతున్నారని దుయ్యబట్టారు. 70 ఏళ్ల తరువాత కూడా దళిత వాడలు పేదరికంలో ఉన్నాయన్నారు. వార్డుకు వార్డుకు తిరుగుతామని, ప్రతీ కుటుంబానికి అందిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. కరోనా కష్ట కాలంలోనూ సిఎం కెసిఆర్ రైతుబంధును అందించారని ప్రశంసించారు. దళిత బంధు విషయంలో ఆహ్వానించాల్సింది పోయి కుట్రలు చేస్తే ఈ కుట్రల్లో బిజెపి, కాంగ్రెసోళ్లు మాడి మసైపోతారని హెచ్చరించారు. బిజెపోళ్లు దళిత బంధును ఆపాలని ఇసికి ఉత్తరాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలను బిజెపోళ్లు రెచ్చగొడుతున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News