Monday, April 29, 2024

స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగులగొట్టుకుంటున్నారు

- Advertisement -
- Advertisement -

Skull Breaker Challenge

 

హైదరాబాద్ : రోజుకో రకమైన ఛాలెంజ్ పుట్టుకు వస్తుండడంతో యువత వాటిని పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో యువత బ్లూవేల్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలా రోజుకొకటి పుట్టుకు వస్తుండడం వాటిని యువత అనుసరించడంతో ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ రావడంతో దానిని చేస్తూ యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ లేదా ట్రిప్పింగ్ జంప్ పట్ల యువత ఆకర్షితులవ్వడంపై పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఛాలెంజ్‌లు ఎక్కువయిపోయాయి, అందులో కొన్ని ఇతరులకు మంచి చేసేవిగా ఉన్నా కొన్ని మాత్రం వాటిని చేసే వారి ప్రాణాలు తీసేవిధంగా ఉన్నాయి.

రన్నింగ్ కారులో నుంచి దిగి… స్లోగా కదులుతున్న కార్ పక్కన డ్యాన్స్ చేసి మళ్లీ కారు ఎక్కే ‘రన్నింగ్ మ్యాన్’ ఛాలెంజ్. దీని వల్ల చాలామంది రోడ్డు ప్రమాదాల బారినపడ్డారు. ఒకరి నోట్లోని సిరీల్సు తీసుకుని తినే సిరీల్ ఛాలెంజ్ వచ్చింది. బర్డ్ బాక్స్ ఛాలెంజ్, కళ్లకు గంతలు కట్టుకుని వివిధ పనులు చేయడమే ఈ ఆట ప్రత్యేకత. ఒక అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని కారు నడిపి గోడను గుద్దేసింది. ఇది అమెరికాలోని ఉటా రాష్ట్రంలో జరిగింది.

దీంతో యువతి తలకు గాయాలయ్యాయి. 2016లో బ్లూవేల్ ఆట ప్రపంచాన్ని కుదిపేసింది. చేతిమీద తిమింగళం బొమ్మ గీయించుకుని ఆడటం జరిగేది. చివరికి అటగాడి మృతితో ఆట ముగిసేది. దేశంలో చాలామంది పిల్లలు, యువకులు ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కికి ఛాలెంజ్ కూడా ఇలాంటిదే ఛాలెంజ్ నెట్‌లో వైరల్ అవుతోంది. మెక్సికో సహాదక్షిణ అమెరికా, యూరప్ దేశాల్లో స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఇండియాలో సోషల్ మీడియాలో స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ లేదా ట్రిప్పింగ్ జంప్ ఛాలెంజింగ్ స్టంట్ వైరల్ అవుతోంది. యువత ఈ ఛాలెంజ్ బారిన పడే అవకాశం ఉంది.

స్కల్ బ్రేకర్ ఛాలెంజ్…
ఈ ఛాలెంజ్‌లో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడి ఉంటారు. మధ్యలో ఉన్న వ్యక్తి గాల్లో ఎగిరినప్పుడు చెరోవైపు ఉన్న ఇద్దరు వ్యక్తులు గాల్లో ఎగిరిన వ్యక్తి కాళ్లని కొడతారు. గాల్లో ఎగిరిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవాలి లేకపోతే నేలమీద గట్టిగా పడతాడు. అలా నేల మీద పడినప్పుడు తల నేలను గట్టిగా గుద్దుకోవడంతో పగలడం, చేతులు విరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సర్య్కులేట్ అవుతున్నాయి. ఎక్కువగా పాఠశాలల పిల్లలు దీన్ని చేస్తున్నారు. ఈ వీడియోలను చూసి వైద్యులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని చేసిన వారు పుర్రెకు సంబంధించిన గాయాలు కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్తున్నారు. అంతేకాకుండా నడుముకు తీవ్రంగా గాయలు కావడంతో మంచనుంచి లేవడంలేదు.

ఎముకలు విరిగే ప్రమాదం…
స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ జంప్‌లో భాగంగా స్టంట్లు చేయడం వల్ల తల, చేతి ఎముకలు విరిగే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఛాలెంజ్ తీసుకుని వెనక్కు పడితే కీళ్లన్నీ విరిగిపోతాయి, తుంటి ఎముకలతో పాటు మోకాళ్లు, మోచేతులు, ఇతర కీళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇంకో ఎముకతో ఎముకను కలిపే లిగమెంట్లు తెగిపోయే ప్రమాదముంది. నేలపై పడిన వ్యక్తికి నడుము, మోకాలి చీలమండకు సంబంధించిన గాయాలవుతాయి. కొన్నిసార్లు తలకు బలమైన గాయమైతే చనిపోవచ్చే లేదా జీవితాతం మంచానికే పరిమితం కావాల్సి ఉంటుంది.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలిః విసి సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్కల్ ఛాలెంజ్ పట్ల యువత, విద్యార్థులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. యువత ఇలాంటి వాటిని అనుసరించవద్దని, దీని వల్ల ప్రాణాలో కోల్పోయే ప్రమాదం ఉందని కోరారు. ఇలాంటి ఛాలెంజ్‌లకు సంబంధించిన వీడియోలు తీసినా,ప్రచారం చేసినా చర్యలు తప్పవని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఈ విషయమై ఏదేని సాయం కావాల్సిన వారు 100కాల్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 9490617444 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.

Dangerous Skull Breaker Challenge effects on youth
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News