Sunday, April 28, 2024

‘హౌడీ మోడీ’కి పైసా ఖర్చు పెట్టలేదు

- Advertisement -
- Advertisement -

హౌడీ మోడీకి పైసా ఖర్చు పెట్టలేదు
రాజ్యసభలో ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హూస్టన్ నగరంలో జరిగిన హౌడీ-మోడీ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదని, ఆ కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిందని ప్రభుత్వం గురువారం తెలిపింది. 2019 సెప్టెంబర్ 22న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కలసి ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 వేల మందికి ఇండో-అమెరికన్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోడీకి అపూర్వ స్వాగతం లభించింది.హౌడీ, మోడీ! ఈషేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్స్‌” పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరమ్ ఇన్‌కార్పొరేషన్ అనే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టడం లేదా నిర్వాహకులు విరాళాలు సేకరించడం వంటివి జరిగాయా అన్న ప్రశ్నకు మంత్రి అటువంటి వేవీ లేవని జవాబిచ్చారు. టెక్సాస్‌లో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన జుగల్ మలాని అనే వ్యక్తి టెక్సాస్ ఇండియా ఫోరమ్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రి చెప్పారు. తన అమెరికా సందర్శనలో భాగంగా ప్రధాని మోడీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో పాల్గొని భారతీయ-అమెరికన్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారని, వారిలో చాలామంది అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నారని మంత్రి వివరించారు.

did not spend money on Howdy-Modi Event: Center

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News