Monday, April 29, 2024

తెలుగు బాలికకు ట్రంప్ గౌరవం

- Advertisement -
- Advertisement -

Donald Trump

వాషింగ్టన్ : కోవిడ్19 బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి కుకీస్(ఆహార పదార్థాలు) విరాళంగా ఇచ్చినందుకు పదేండ్ల తెలుగు బాలిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి గౌరవం స్వీకరించారు. మేరీల్యాండ్‌లోని హానోవర్ హిల్స్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న తెలుగు బాలిక శ్రావ్య అన్నపరెడ్డి విద్యార్థుల స్కౌట్ బృందంలో పని చేస్తున్నారు. శ్రావ్యతోపాటు అదే పాఠశాలకు చెందిన మరో ఇద్దరు బాలికలు కూడా ట్రంప్ నుంచి గౌరవం స్వీకరించారు. పదేండ్ల వయసు వారైన సౌట్ బృందం బాలికలు వైద్య సిబ్బందితోపాటు అగ్నిమాపక దళం సభ్యులకు 100 పెట్టెల కుకీస్‌తోపాటు 200 గ్రీటింగ్ కార్డులను బహుమతిగా ఇచ్చారు. శ్రావ్య తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.

Donald Trump honours Telugu girl for Corona help

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News