Friday, May 17, 2024

రక్తంతో ప్రధాని మోడీకి లేఖ..

- Advertisement -
- Advertisement -

నోయిడా: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి భారతీయ కిసాన్ యూనియన్(లోక్‌శక్తి) అధినేత షియోరాజ్‌సింగ్ రక్తంతో లేఖ రాశారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కి హామీ ఇచ్చేలా చట్టాన్ని తేవాలని, కిసాన్ ఆయోగ్(వ్యవసాయ కమిషన్) ఏర్పాటు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో సింగ్ కోరారు. సింగ్ రాసిన లేఖను నోయిడాలోని అధికారులకు ఇచ్చామని, వారు ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ)కు పంపిస్తామని చెప్పారని బికెయు(లోక్‌శక్తి) అధికార ప్రతినిధి శైలేశ్‌కుమార్‌గిరి తెలిపారు.
డిసెంబర్ 2 నుంచి బికెయు కార్యకర్తలు నోయిడాలోని దళిత్ ప్రేమాస్థల్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. బుధవారం మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జన్మదినం సందర్భంగా రైతు దినోత్సవాన్ని జరుపుకున్నారు. 200మంది కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్, ముజఫర్‌నగర్, మీరట్, ఫిరోజాబాద్‌లోనూ బికెయు ఆందోళనలు నిర్వహిస్తోంది.

Farmers Write letter to PM Modi with Blood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News