Sunday, April 28, 2024

విజయవాడ స్వర్ణప్యాలెస్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire accident Vijayawada Covid care center

అమరావతి: విజయవాడ స్వర్ణప్యాలెస్ లో ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ హోటల్లో కరోనా పేషంట్లకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. హోటల్ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. స్వర్ణ ప్యాలెస్ ను ప్రభుత్వం కరోనా ఆస్పత్రిగా మార్చింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కరోనా రోగులు మృతి చెందారు. ప్రమాద సమయంలో హోటల్లో 50 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సిపి తెలిపారు.

భారీగా పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. బాధితులు హోటల్ కిటికీల్లోంచి కేకలు వేస్తున్నారు. అగ్నిప్రమాదంపై సిఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోవిడ్ సెంటర్ లో ప్రమాద ఘటనపై సిఎం ఆరా తీశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిచాలని జగన్ అధికారులకు ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి నివేదించాలన్నారు. మంత్రి వెల్లంపల్లి, కలెక్టర్, సిపి ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనాసగుతున్నాయని సిపి శ్రీనివాసులు తెలిపారు. బాధితులను అన్నివిధాల ఆదుకుంటామని మంత్రి వెల్లంపల్లి హామీ ఇచ్చారు.

Fire accident Vijayawada Covid care center

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News