Monday, April 29, 2024

బిసిసిఐపై సెహ్వాగ్ ఫైర్

- Advertisement -
- Advertisement -

Former cricketer Virender Sehwag fire on BCCI

 

న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు రోహిత్ శర్మను పక్కన బెడుతూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని విమర్శించాడు. రోహిత్ వంటి దిగ్గజాన్ని బోర్డు ఘోరంగా అవమానించిందని ఆరోపించాడు. ప్రపంచంలోనే అత్యుత్త ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రోహిత్‌ను సెలెక్టర్లు కావాలనే అవమానిస్తున్నారని విమర్శించాడు. ఇక రోహిత్ ఎంపిక గురించి తనకు తెలియదని ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొనడంపై కూడా సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు. కోచ్‌గా ఉన్న వ్యక్తికే ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి తెలిసి ఉండక పోవడం విడ్దూరంగా ఉందన్నాడు. అంతేగాక రోహిత్ విషయంలో బోర్డు అధ్యక్షుడు గంగూలీ చేసిన వ్యాఖ్యలను కూడా సెహ్వాగ్ తప్పుపట్టాడు. ఓ దిగ్గజ ఆటగాడి గురించి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యత లేకుండా మాట్లాడం మంచిది కాదని పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News