Monday, April 29, 2024

గవర్నర్ ప్రసంగం తెలంగాణ ఖ్యాతిని చాటింది

- Advertisement -
- Advertisement -

KARNE PRABHAKAR

 

మీడియా పాయింట్

ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభలో శుక్రవారం బడ్జెట్ సమావేశాలు సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం తెలంగాణా ఖ్యాతిని చాటిందని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియా పాయిం ట్లో మాట్లాడుతూ…దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణాను ఆదర్శంగా తీసుకునేలా గవర్నర్ ప్రసంగం ఉందని ఆయన అన్నారు.అన్ని రంగాల్లో తెలంగాణా అగ్రగామీగా ఉందని ఇదే విషయాన్ని ప్రస్పూటంగా గవర్నర్ ప్రసంగంలో ఉందని ఎమ్మెల్సీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దైర్యం దెబ్బతీసేలా ప్రతిపక్షాలు నోరుమూగబోయేలా రాష్ట్రం ప్రగతి ముందకు వెళ్తుందన్నారు. 17 లక్షల ఎకరాల నుంచి ప్రస్తుతం వివిధ ప్రాజెక్టుల ద్వారా 38 లక్షల ఎకరాలు సాగు చేసే పరిస్థితి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాలతో పాటు ఉద్యోగాలకు కూడా పెద్దపీఠ వేసిందని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 2వేల కంపెనీలు ఏర్పాటు చేసి 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.

ప్రతిపక్షాలు ప్రతి పథకాన్ని వక్రీకరన దృష్టితోనే చూస్తున్నాయని ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రం అభివృద్దిని చూసి అందరు గర్వపడాలని అన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ..అన్ని రంగాలలో ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య, ఉద్యోగాల భద్రత కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించని ఘనతని గత ఆరు సంవత్సరాల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సొంతం చేసుకుందన్నారు. పల్లే ప్రగతి, పట్ణణ ప్రగతి కార్యక్రమాలు అద్బుతంగా ప్రజలకు దగ్గరయ్యాయని ఆయన తెలిపారు.

అప్రజాస్వామిక పాలన : కాంగ్రెస్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామిక పాలన చేస్తుందని, ఒక ఎంపిని అరెస్టు చేయడ దారుణమని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి మీద కేసులు ఉపసంహరణ చేసుకొని ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని, ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రంలోని పట్టణాల్లో పారిశుద్ధ్య, పరిశుభ్రత కోసం పట్టణ ప్రగతి చెప్పటిన ప్రభుత్వం ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లలేకపోయిందన్నారు.

అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై చర్య తీసుకోకుండా డ్రోన్ కెమెరా ఉపయోగించారని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడం ఆశ్చర్యకరమన్నారు. కేవలం పోలీసుల అత్యుత్సాహం తో రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ..తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. తాను నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తినని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ..గవర్నర్ ప్రసంగంలో పసలేదని తెలిపారు.

కొత్త సీసాలో పాత సారా : బిజేపి
గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదని, పాత బాటిల్‌లో కొత్త సార అనే సామెతలా ఉందని బిజేపి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ. విద్యార్థులను, నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. నిరుద్యోగ భృతి విషయమే ప్రసంగంలో పేర్కొనలేదని తెలిపారు. ప్రభుత్వం చెప్పేది విని, విని చెవుల నుండి రక్తాలు కారుతున్నాయని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం గవర్నర్ తో అబద్దాలు పలికించిందని బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శుక్రవారం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ..తప్పుడు లెక్కలు తప్పుడు రిపోర్టులతో గవర్నర్‌తో ప్రసంగం చదివిపించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా టిఆర్‌ఎస్ పార్టీ నిలబెట్టుకోపోయిందన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని ధీమా వ్యక్తం చేశారు.

నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో స్పష్టత లేదు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
గవర్నర్ ప్రసంగంలో పాత వివరాలే ఉన్నాయని కొత్తగా ఏం లేవని అన్నారు. నిళ్లు, నిధులు, ఉద్యోగాల్లో స్పష్టత ఇవ్వలేదని తెలిపారు.

 

Governor speech has sparked Telangana Reputation
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News