Monday, April 29, 2024

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: కర్నాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు నిండుకున్నాయి. దీంతో ఆ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 2,77,640 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో  29,862 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 553 అడుగులుగా ఉంది. నీటిని విడుదల చేసి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టిఎంసిలుండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 216.43 టిఎంసిలుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News